Chiranjeevi: భోళా శంకర్ కి శ్రీకారం చుట్టిన చిరు!

Published : Nov 11, 2021, 09:54 AM IST
Chiranjeevi: భోళా శంకర్ కి శ్రీకారం చుట్టిన చిరు!

సారాంశం

కుర్ర హీరోలు కూడా మెగా స్టార్ చిరంజీవి స్పీడ్ ని అందుకోలేకున్నారు. ఆచార్య సెట్స్ పై ఉండగానే మూడు చిత్రాలు ప్రకటించిన చిరంజీవి.... షూటింగ్ కి కూడా సిద్ధం అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేడు భోళా శంకర్ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ వేదికగా నిర్వ్హయించిన ఈ వేడుక ఘనంగా జరిగింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాజరు కాగా, అట్టహాసంగా నిర్వహించారు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్, హరీష్ శంకర్ ,కొరటాల శివ, గోపీచంద్ మలినేని, హాజరయ్యారు. అలాగే చిత్ర నిర్మాతలుగా ఉన్న అనిల్ సుంకర, కే ఎస్ రామారావు పాల్గొన్నారు. 
భోళా శంకర్ చిత్రంలో చిరుకు జంటగా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన జరుగగా, నేడు ఆమె కూడా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 

త్వరలో భోళా శంకర్ (Bhola shankar) సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం కి తెలుగు రీమేక్ అంటూ ప్రచారం సాగుతుంది. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Also read Tamannah bhatia: చిరు జంటగా తమన్నా... మరో భారీ ఆఫర్ పట్టేసిన మిల్కీ బ్యూటీ
కాగా దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య (Acharya) పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆచార్య ఫిబ్రవరి 4న గ్రాండ్ గా విడుదల కానుంది. సామాజిక అంశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటిసారి చిరు, చరణ్ (Ram charan) కలిసి ఓ పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

Also read క్రేజీ బజ్... మెగా 154లో పవన్ కళ్యాణ్ కూడా?
ఇక దర్శకుడు బాబీతో తన 154వ చిత్రం ప్రకటించిన చిరు, ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ఈ మూవీ తెరకెక్కనుంది. అలాగే మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే