ప్రభాస్ అభిమానులకు శుభవార్త ... ‘‘ఆదిపురుష్’’ ఆరో ఆటకు తెలంగాణ సర్కార్ అనుమతి

Siva Kodati |  
Published : Jun 13, 2023, 06:36 PM ISTUpdated : Jun 13, 2023, 06:39 PM IST
ప్రభాస్ అభిమానులకు శుభవార్త ... ‘‘ఆదిపురుష్’’ ఆరో ఆటకు తెలంగాణ సర్కార్ అనుమతి

సారాంశం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా నటించిన ‘‘ఆదిపురుష్’’ చిత్రం ఆరో ఆటో ప్రదర్శనకు కేసీఆర్ సర్కార్ అనుమతించింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన హీరోగా నటించిన ‘‘ఆదిపురుష్’’ చిత్రం ఆరో ఆటో ప్రదర్శనకు కేసీఆర్ సర్కార్ అనుమతించింది. అంతేకాదు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో 3 రోజుల పాటు టికెట్ ధర రూ.50కి పెంచుకునేందుకు అనుమతించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

గ్లోబల్ ఇమేజ్ తో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సీతగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఆదిపురుష్. రావణాసురిడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించగా.. ఇతర పాత్రల్లో స్టార్ కాస్ట్ సందడి చేయబోతోంది.  ఈసినిమాలో ప్రత్యేకతలెన్నో.. మొట్టమొదటి సారి  ఈసినిమా కోసం.. ప్రీరిలీజ్ వేడుకకు జీయర్ స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈమూవీలో ప్రభాస్ మొదటి సారి రాముడిగా కనిపించబోతున్నారు. 

Also Read: ప్రతి రామాలయానికి ఆదిపురుష్ స్పెషల్ గిఫ్ట్, ఆజిల్లాకు మాత్రమే..? ఇచ్చేది ఎవరంటే..?

భూషణ్‌ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మైథలాజికల్‌ మూవీ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది