బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ మూడు రోజుల్లో సీతాదేవిగా థియేటర్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోబోతోంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మూడు రోజుల్లో ఈ హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంతటా Adipurush మాటే వినిపిస్తోంది.
మరోవైపు సీతాదేవి కృతిసనన్ ఇప్పటికే ప్రశంసలు అందుకుంటోంది. ఆదిపురుష్ ప్రచార కార్యక్రమాల్లోనూ సంప్రదాయ దుస్తుల్లోనే హాజరవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆయా ఇంటర్వ్యూల్లోనూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ వస్తోంది కృతి సనన్. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాజాగా కృతి సనన్ పంచుకున్న ఫొటో వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ద్వారా పోస్ట్ చేసిన ఆ పిక్ ఆకట్టుకుంటోంది. అలాగే తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన స్త్రీలుగానూ చెప్పే ప్రయత్నం చేసింది.
కృతి సనన్ పంచుకున్న ఫొటోలో ఒకవైపు సీతాదేవి అవాతరంలో ఉన్న కృతిసనన్, మరోవైపు తన తల్లి గీతా ససన్ ఉన్న త్రో బ్యాక్ ఫొటోను జతచేసి పంచుకుంది. సీతాదేవిని తన జానకీగానూ, తన తల్లిని జాన్ అంటూ తెలియజేసింది. సీతాదేవి తన తల్లి లాంటిదని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక కృతి తనవంతుగా సినిమాను ఇలా ప్రమోట్ చేసే పనిలోనూ ఉంది. ఏదేమైనా సీతాదేవి పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకునేందుకు సిద్ధంగా ఉంది.
మరోవైపు ‘ఆదిపురుష్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బుకింగ్స్ కూడా ఓపెన్ అవడంతో విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు అభిషేక్ అగర్వాల్, రన్బీర్ కపూర్, మంచు మనోజ్, అల్లు అర్జున్ తమ వంతుగా సినిమా టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో జూన్ 14 నుంచి అడ్వాన్డ్స్ ఓపెన్ కానున్నాయి..ఇఫ్పటికే విడుదలైన ట్రైలర్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో ఏ స్థాయిలోవిజయవంతం అయ్యిందో తెలిసిందే. ఈక్రమంలో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.