టీమ్ ఇండియా గెలిస్తే పూనమ్ పాండేలా ఆఫర్ ఇచ్చిన నటి తాన్యా.. ఏం ఇవ్వబోతుందో తెలిస్తే పండగే

Published : Mar 09, 2025, 08:04 PM ISTUpdated : Mar 09, 2025, 08:07 PM IST
టీమ్ ఇండియా గెలిస్తే పూనమ్ పాండేలా ఆఫర్ ఇచ్చిన నటి తాన్యా.. ఏం ఇవ్వబోతుందో తెలిస్తే పండగే

సారాంశం

Tanya Chaudhari: భారత్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే తన హాట్ ఫోటో పోస్ట్ చేస్తానంది నటి, మోడల్ తాన్యా. దీంతో సోషల్ మీడియాలో భారత్ గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tanya Chaudhari: టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే కన్నుల పండుగ చేయడానికి నటి, మోడల్ తాన్యా చౌదరి రెడీగా ఉంది. చాలా ఏళ్ల కిందట మోడల్ పూనమ్ పాండే ఇదే తరహా ఆఫర్ ఇచ్చి ఫేమస్ అయింది. ఇప్పుడు పాండే కంటే ఒక అడుగు ముందుకేసి తాన్యా చౌదరి టీం ఇండియా గెలుపు కోసం ఎంకరేజ్ చేస్తోంది. ఆటగాళ్లు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే తన హాట్ ఫోటో పోస్ట్ చేస్తానని ప్రకటించింది.

ఇండియా గెలిస్తే హాట్‌ ఫోటో షూట్‌ చేస్తా అంటూ తాన్యా చౌదరీ ప్రకటన..

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. భారత్‌కు 252 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఈ టార్గెట్‌ను ఛేజ్ చేసి భారత్ ట్రోఫీ గెలిస్తే నటి తాన్యా నుండి బంపర్ ఆఫర్ ఉంది. స్పెషల్ ఏంటంటే టీం ఇండియా అద్భుతంగా ఆడుతుండటంతో తాన్యా టూ పీస్ డ్రెస్‌లో వచ్చి ఈ ప్రకటన చేసింది. 

read more: SSMB29 Leak: మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదురుపడే సీన్‌ లీక్‌.. పూనకాలు తెప్పిస్తున్న రాజమౌళి

తాన్యా ఈ ప్రకటన చేయగానే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల కోసం ఎదురు చూస్తున్నామని మెసేజ్‌లు పెడుతున్నారు. వచ్చిన కామెంట్లలో చాలామంది రాత్రి 10 లేదా 11 గంటలని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు చాలామంది టైమ్ చూస్తున్నామని చెబుతున్నారు.

 

 

చాలాసార్లు టీం ఇండియా ఐసీసీ టోర్నీల ఫైనల్‌కు రాగానే మోడల్స్, నటీమణులు ఇలాంటి ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. కన్నులకు విందు చేసే ఇలాంటి ఆఫర్లకు హెడ్ మాస్టర్ నటి పూనమ్ పాండే. 2011 వరల్డ్ కప్ సమయంలో పూనమ్ పాండే ఇదే తరహాలో టీం ఇండియాకు ఆఫర్ ఇచ్చింది. తర్వాత ఇది పెద్ద వివాదమైంది. పూనమ్ పాండే తన ప్రామిస్‌ను చాలాసార్లు 90 శాతం వరకు నిలబెట్టుకుంది. 

ఇప్పుడు తాన్యా చౌదరి వంతు. తాన్యా హాట్ మోడల్‌గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుని ఆకట్టుకుంది. ఇంకా యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌తో పాటు చాలా వేదికలపై తాన్యా చౌదరి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త ఆఫర్‌తో రచ్చ చేస్తోంది. ఒకవైపు తాన్యా చౌదరి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు టీం ఇండియా గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా మంచి ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. అటు న్యూజిలాండ్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ న్యూజిలాండ్ బలంగా ఉంది. 252 రన్స్ టార్గెట్ ఉన్న టీం ఇండియా బ్యాటింగ్ వైపు అందరి చూపు ఉంది. 

ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహిస్తోంది. కానీ టీం ఇండియా పాకిస్తాన్ వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో ఇండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఇండియా లీగ్ స్టేజ్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై గెలిచింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. 

 read more: కృతి సనన్ డ్రెస్‌ పై ట్రోల్స్, `అది వేసుకోవడం మర్చిపోయిందా?`.. ఐఫాలో ఆమె లుక్‌పై క్రేజీ సెటైర్లు

also read: శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్‌, అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. పోస్ట్ వైరల్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం