SSMB29 Leak: మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదురుపడే సీన్‌ లీక్‌.. పూనకాలు తెప్పిస్తున్న రాజమౌళి

Published : Mar 09, 2025, 05:47 PM ISTUpdated : Mar 10, 2025, 06:51 PM IST
SSMB29 Leak: మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎదురుపడే సీన్‌ లీక్‌.. పూనకాలు తెప్పిస్తున్న రాజమౌళి

సారాంశం

SSMB29 Leak: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి షాకింగ్‌ వీడియో లీక్‌ అయ్యింది. హీరో, విలన్‌ ఎదురుపడే కీలక సీన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. మహేష్‌ ఫ్యాన్స్ మాత్రం ఊగిపోతున్నారు.  

SSMB29 Leak: మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పుడు భారీ యాక్షన మూవీ రూపొందుతుంది. ఆ మధ్యనే ఈ మూవీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మెయిన్‌ కాస్టింగ్‌ పాల్గొంటుందట.

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

`ఎస్‌ఎస్‌ఎంబీ29` సెట్‌ నుంచి క్రేజీ వీడియో లీక్‌..

తాజాగా మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా నుంచి క్రేజీ వీడియో లీక్‌ అయ్యింది. మహేష్‌ బాబుపై చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశం లీక్‌ కావడం గమనార్హం. ఇందులో చూడ్డానికి అడవి లాంటి ప్రాంతంగా అనిపిస్తుంది. కాకపోతే పర్వాతలు ఉండటంతో విశాలంగానూ ఉంది.

ఓ వ్యక్తి వీల్‌ ఛైర్‌లో ఉన్నారు. కొందరు ప్రైవేట్‌ సెక్యూరిటీ మహేష్ బాబుని పట్టుకుని ఆయన ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్‌ తనదైన స్టయిల్‌లో నడుచుకుంటూ వచ్చాడు, ఓ సెక్యూరిటీ  అతను వచ్చి కింద కూర్చోబెట్టాడు. వెనకాల చేతులు పెట్టించాడు. 

`ఎస్‌ఎస్‌ఎంబీ29` మహేష్‌ బాబు, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ఎదురుపడే సీన్‌ కేక 

వీల్‌ చైర్‌లో వ్యక్తి చూస్తున్నాడు. ఆ వీల్‌ ఛైర్‌లో ఉన్నది మెయిన్‌ విలన్‌గా తెలుస్తుంది. అతనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌గా అనిపిస్తుంది. ఈ ఇద్దరు ఎదురుపడే సన్నివేశంగా ఇది కనిపిస్తుంది. హీరో మహేష్‌ని విలన్‌ బంధించి వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశంలా ఇది కనిపిస్తుంది. చూడ్డానికి గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది.

ఇందులో మహేష్‌ ఊరమాస్‌ లుక్‌లోనే ఉన్నారు. జస్ట్ లీక్‌ వీడియోనే ఈ రేంజ్‌లో ఉంటే అది, సినిమాలో ఆర్‌ఆర్‌ మిక్సింగ్‌లో ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లుక్‌ లీక్‌ టీమ్‌ని ఇబ్బంది పెట్టినా మహేష్‌ బాబు ఫ్యాన్స్ మాత్రం కాలర్‌ ఎగరేసేలా ఉంది. దీన్ని వాళ్లు సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 

టైట్‌ సెక్యూరిటీ `ఎస్‌ఎస్‌ఎంబీ29` నుంచి వీడియో ఎలా లీక్ అయ్యింది?

అయితే రాజమౌళి సినిమా టైట్‌ సెక్యూరిటీ ఉంటుంది. సెట్‌కి సెల్‌ ఫోన్‌లను అనుమతించరు. ఎవరికైనా ఇది మినహాయింపు కాదు, అలాంటిది ఈ సెట్‌లోకి సెల్‌ఫోన్‌ ఎలా వచ్చిందనేది మిస్టరీ. ఇలాంటి కీలక సన్నివేశాలు లీక్‌ అయితే సినిమాపైనే అది ప్రభావం పడుతుంది. మరి దీనిపై జక్కన్న టీమ్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ ని ఊపేస్తుంది. మహేష్‌ హీరోగా ఈ సినిమాని ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని, మహేష్‌ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. 

read more: జూ.ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్?

also read: జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్‌ వార్నింగ్‌.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్