ఎన్టీఆర్ ఈమెను మోసం చేశాడట

Published : Oct 07, 2017, 04:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఎన్టీఆర్ ఈమెను మోసం చేశాడట

సారాంశం

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా జైలవకుశ జై లవ కుశలో ఐటెం సాంగ్ చేసిన తమన్నా తమన్నాకి పెద్దగా కలిసిరాని ‘స్వింగ్ జరా’

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రెండు సినిమాల్లో తమన్నా.. ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. దీంతో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ లో ఐటెం సాంగ్ చేసే అవకాశం ఈ అమ్మడికి దక్కింది.

 

తారక్ తో ఐటం అనగానే తమన్నా రేంజ్ మారుతుందని.. ఆ సాంగ్ తన కెరియర్ ను గాడిలో పడేస్తుందని భావించింది. అందుకే స్వింగ్ జరాలో అమ్మడు ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శన చేసింది. అయితే సినిమాలో అనుకున్నంత రేంజ్ లో ఆ సాంగ్ పండలేదు. 

 

ఈ సాంగ్ తో ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న తమన్నా ఆశలు అడి ఆశలయ్యాయి. సినిమా హిట్ పడినా తమన్నా సాంగ్ గురించి మాత్రం ఎవరు మాట్లాడటం లేదు. జనతాగ్యారేజ్ లో  కాజల్ చేసిన పక్కా లోకల్ కి వచ్చిన క్రేజ్.. తమన్నా స్వింగ్ జరాకి రాలేదు.  అంతేకాదు.. స్వింగ్ జరా పాటలో తమన్నా కన్నా కూడా ఎన్టీఆర్ జై పాత్ర గురించే అందరూ మాట్లాడుకున్నారు.  క్రెడిట్ అంతా కూడా ఎన్టీఆర్ కే దక్కడంతో  తమన్నా చాలా డిసపాయింట్ అయ్యిందట

 

అయితే.. తమన్నా గతంలో చేసిన ఐటెం సాంగ్స్ కంటే.. ఇందులో చాలా హాట్ గా కనిపించింది. పాట హిట్ కాకున్నా.. తమన్నా అందాలకు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో నటిస్తున్న తమన్నా ఆ సినిమాతో అయినా మళ్లీ ఫాంలోకి వస్తుందో లేదో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?