రాజుగారి గది2 లో కాజల్?

Published : Oct 07, 2017, 03:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రాజుగారి గది2 లో కాజల్?

సారాంశం

నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజుగారి గది2’ దెయ్యం పాత్ర పోషిస్తున్న సమంత మరో కీలక పాత్రలో కాజల్ నటిస్తున్నట్లు టాక్  

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాజుగారి గది2. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ జోనర్ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించిన రాజుగారి గది సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

.ఈ సినిమాలో మెంటలిస్టు పాత్ర లో నాగార్జున నటించగా,  దెయ్యం పాత్రలో సమంత కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

 

కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తోందని, ఆమె క్యారెక్టర్ సినిమాని ఒక కీలక మలుపు తిప్పుతుందని సమాచారం. 

కాజల్ కూడా ఈ సినిమాలో కొంతసేపు దెయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం కోసమే ఈ విషయాన్ని దాచారని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్