ఆ హీరో వల్లే 50 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోలేదు.. RRR నటుడిపై టబు హాట్ కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Nov 06, 2021, 09:56 AM IST
ఆ హీరో వల్లే 50 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోలేదు.. RRR నటుడిపై టబు హాట్ కామెంట్స్

సారాంశం

బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించింది టబు. తన అందాలతో ఒక ఊపు ఊపింది. వయసు ఐదు పదులు దాటినా ఆమె అందాల ఘాటు ఇంకా తగ్గలేదు. 

బాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించింది టబు. తన అందాలతో ఒక ఊపు ఊపింది. వయసు ఐదు పదులు దాటినా ఆమె అందాల ఘాటు ఇంకా తగ్గలేదు. 90 దశకంలో ఎలా ఉందో ఇప్పటికి అంతే నాజూగ్గా ఉంది. ప్రేమదేశం, నిన్నే పెళ్లాడతా, ప్రియురాలు పిలిచింది లాంటి చిత్రాలతో అప్పట్లో యువత మొత్తం టబు జపం చేశారు. 

విక్టరీ వెంకటేష్ సరసన కూలి నెం.1 చిత్రంతో Tabu టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే గ్లామరస్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా టబు ఇంకా పెళ్లిచేసుకోకపోవడం ఒక మిస్టరీనే. ఇంతటి అందాల సుందరి 50 ఏళ్ల వయసు దాటినా పెళ్లి చేసుకోలేదంటే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. బహుశా సల్మాన్ ఖాన్ ని ఫాలో అవుతుందేమో. 

Also Read: మైనర్ బాలిక రేప్ కేసు: ఫన్ బకెట్ భార్గవ్ బెయిల్ రద్దు.. మళ్ళీ జైలుకు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టబు తన పెళ్లి గురించి ప్రస్తావించింది. ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి  కారణం చెప్పింది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ స్టార్ అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అయితే టబు చెప్పిన కారణాలు సరదాగా ఉన్నాయి. ఇంతకీ టబు ఏం చెప్పిందంటే.. నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండడానికి కారణం Ajay Devgn. అజయ్ నాకు కోస్టార్ మాత్రమే కాదు.. చిన్నప్పటి నుంచి స్నేహితుడు. 

నా సోదరుడికి అజయ్ దేవగన్ స్నేహితుడు. మేమంతా ముంబై జుహు ప్రాంతంలోనే పెరిగాం. అజయ్ ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. నేను ఎక్కడికి వెళ్లినా న వెంట వచ్చేవాడు. వేరే అబ్బాయిలు నాతో మాట్లాడినా ఒప్పుకునేవాడు కాదు.. వాళ్ళని కొట్టడానికి వెళ్ళేవాడు. అలా మేమిద్దరం కలసి పెరిగాం. అజయ్ వల్లే నేను పెళ్లి చేసుకోలేదు. నాకు పెళ్లి కాకపోవడానికి కారకుడైన అజయ్ పశ్చాత్తాపపడాలి అని టబు  కామెంట్స్ చేసింది. 

Also Read: Deepika pilli : ఢీ యాంకర్ దీపిక పిల్లి బ్లాస్టింగ్ ఫోజెస్... ట్రెండీ వేర్ లో సెగలు రేపుతున్న యంగ్ బ్యూటీ

అజయ్ దేవగన్, టబు ఇద్దరూ 'దృశ్యం', 'గోల్‌మాల్ అగెయిన్‌', 'విజ‌య్‌ప‌థ్', 'హ‌కీక‌త్' చిత్రాల్లో నటించారు. చివరగా వీరిద్దరూ 'దేదే ప్యార్ దే' చిత్రంలో నటించారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. 

తెలుగులో టబు నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవ రెడ్డి, అందరి వాడు, పాండురంగడు లాంటి చిత్రాల్లో నటించింది. టబు కెరీర్ లో వివాదాలు కూడా ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసులో టబు పేరు కూడా ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే