బిగ్‌బాస్5 శుక్రవారం ఎపిసోడ్ ఓ వైపు మానస్- ప్రియాంకల మధ్య లవ్ స్టోరీ, మరోవైపు షణ్ముఖ్, సిరిల మధ్య ఫ్రెండ్షిప్ విభేదాలతో హీటెక్కింది. ఆద్యంతం రక్తికట్టింది. దీపావళి పండుగ సందర్భంగా ఆద్యంతం కలర్ ఫుల్‌గా సాగింది.
బిగ్‌బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5), 61వ రోజు(62వ ఎపిసోడ్) ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. ఓ వైపు మానస్- ప్రియాంకల మధ్య లవ్ స్టోరీ, మరోవైపు షణ్ముఖ్, సిరిల మధ్య ఫ్రెండ్షిప్ విభేదాలతో హీటెక్కింది. ఆద్యంతం రక్తికట్టింది. దీపావళి పండుగ సందర్భంగా ఆద్యంతం కలర్ ఫుల్‌గా సాగింది.
61వ రోజు శుక్రవారం ఎపిసోడ్లో సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ టీమ్‌లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఇరు టీమ్‌లు దిమ్మలపై నిల్చొని ఒకరినొకరు నెట్టేసుకోవాల్సి ఉంటుంది. అందులో సూపర్ విలన్స్ టీమ్ సభ్యులు కింద పడకుండా నిలవడంతో విజేతలుగా నిలిచారు. అంతకు ముందు మానస్, ప్రియాంకల మధ్య ఓ ఆసక్తికర చర్చ జరిగింది. నువ్వు కంటెంట్‌గా మారుతున్నావని మానస్ అన్నాడని, అందుకు ఫీల్ అయ్యానని తెలిపింది ప్రియాంక. వేరే వాళ్లంటే ఫీల్ అయ్యేదాన్ని కాదని, మానస్ అనడం చాలా బాధగా ఉందని చెప్పింది. సిరి వద్ద తన బాధని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. దీంతో ఆమెని ఓదార్చింది సిరి.
undefined
ఆ తర్వాత మానస్, ప్రియాంక కలిసి పోయారు. ఇద్దరు బెడ్‌పై హగ్ చేసుకున్నారు. ఇది చూసిన ఇంటి సభ్యులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాళ్లు ఏం చేస్తున్నారని సన్నీ అడగ్గా, ప్రేమించుకుంటున్నారని కాజల్ చెబుతుంది. మరీ ఇలా పబ్లిక్‌గానా ప్రేమించుకునేది అంటూ సెటైర్లు వేశారు సన్నీ. కాసేపు ఈ సన్నివేశం బిగ్‌బాస్ హౌజ్‌లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది.
మరోవైపు గెలిచిన సూపర్ విలన్స్ టీమ్ సభ్యులకు `చిక్కడు దొరకడు` అనే మరో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో విలన్స్ టీమ్ సభ్యులను బాల్స్ తో కొట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరిపై ఎక్కువ విలువ గల బాల్స్ పడుతాయో వాళ్లు ఎలిమినేట్ అవుతారు. ఇలా మొదట జెస్సీ, విశ్వ, సిరి, రవి, సన్నీ ఎలిమినేట్ అవుతారు. చివరికి అనీ మాస్టర్ నిలిచారు. ఆమె బాల్స్ తనపై పడకుండా గేమ్ ఆడారు. దీంతో నెక్ట్స్ వారం కెప్టెన్‌గా విజయం సాధించారు. నువ్వు ఎప్పుడు కెప్టెన్ అవుతావని గత వారం నాగార్జున అన్నట్టుగా ఈ వారం కెప్టెన్ గా విజయం సాధించింది.
అయితే ఈ టాస్క్ లో తనపై షణ్ముఖ్ బాల్స్ ఎక్కువగా వేశాడని ఫీల్ అయ్యింది సిరి. అంతేకాదు ఆయనపై ఫైర్ అయ్యింది. ఓ ఫ్రెండ్ అయి ఉండి తనపై బాల్స్ వేస్తావా? అంటూ మండిపడింది. తాను మూడో రౌండ్లోనే ఎలిమినేట్ కావడంతో బాధని వ్యక్తం చేసింది. ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు, స్నేహం విలువ తెలియదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు ఫేక్ అంటూ మండి పడింది. గతంలో అన్నన్ని మాటలు అన్నావ్ నేను బాధపడలేదు, కానీ ఓ ఫ్రెండ్‌గా నువ్వు నన్ను ఔట్ చేసేందుకు బాల్స్ వేశావని బాధపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు తనని హౌజ్ నుంచి పంపించేయండి బిగ్ బాస్ వెళ్లిపోతానని, ఇక్కడ ఉండలేకపోతున్నానని తెలిపింది.
అక్కడి నుంచి వెళ్లిపోయిన సిరి దూరంగా ఒంటరిగా కూర్చొంది. మరోవైపు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న షణ్ముఖ్‌ని ఓదార్చింది ప్రియాంక. ఒంటరిగా గేమ్ ఆడటం కూడా తప్పా అంటూ తన బాధని వ్యక్తం చేశాడు షణ్ముఖ్. మరోవైపు తనని అందరు టార్గెట్ చేసి బాల్స్ కొట్టడంపై సన్నీ వాపోయారు. కామెడీగా చెప్పాడు. ఫ్రెండ్స్ కలిస్తే ఎలా ఉంటుందో, గ్రూపుగా ఆడితే ఎలా ఉంటుందో చూశారుగా అంటాడు. తనపై అణ్వాయుధాలు ప్రదర్శించారని, ఫ్యాక్షనిస్ట్ గా చూస్తున్నారని, మళ్లీ దొరకడని కొట్టినట్టుందని కామెడీగా చెప్పి నవ్వులు పూయించాడు సన్నీ.
బాధపడుతున్న సిరి వద్దకు వచ్చి జెస్సీ ఓదార్చాడు. నువ్వు తనకు ట్రూ ఫ్రెండ్ అంటాడు. ఆమె కూడా జెస్సీని ట్రూ ఫ్రెండ్ అంటుంది. అంతేకాదు షణ్ముఖ్ కూడా ట్రూ ఫ్రెండ్ అని చెబుతుంది. అంతేకాదు దీప్తి, షణ్ముఖ్‌ల మధ్య రిలేషన్‌కి సంబంధించి ఓ బాంబ్ పేల్చింది. ఓ సీక్రెట్‌ని రివీల్ చేసింది. బెడ్‌పై కూర్చొన్నప్పుడు షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా ఇచ్చిన గిఫ్ట్ వాచ్‌ని సిరి పెట్టుకుంటుంది. ఇన్నాళ్లు తాను పెట్టుకోలేదని, అయితే బిగ్‌బాస్‌లోకి వచ్చాక షణ్ముఖ్ నుంచి ఎలాంటి గిఫ్ట్ రాలేదని, అందుకు షణ్ముఖ్ చాలా బాధపడుతున్నట్టు తెలిపింది సిరి. అందుకే ఈ వాచ్ ఇప్పుడు పెట్టుకున్నట్టు తెలిపింది.
మరోవైపు మానస్, కాజల్ మధ్య ఓ ఆసక్తికర డిస్కషన్ జరిగింది. తనకి, కాజల్‌కి మధ్య ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారని అంతా అంటున్నారని, షణ్ముఖ్ కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని కాజల్‌తో మానస్ చెప్పాడు. దీంతో కన్నీళ్లు పెట్టుకుంది కాజల్. అంతకు ముందు శ్రీరామ్, రవి, విశ్వల మధ్య గుసగుసలు జరిగాయి. దీంతో ఈ పరిణామాలు బిగ్‌బాస్‌లో కొత్త రిలేషన్ స్టార్ట్ కాబోతున్నాయనే సంకేతాలనిస్తుంది. మరోవైపు ప్రిస్టీజ్కి సంబంధించి ఇచ్చిన గేమ్‌లో స్టౌవ్‌ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. బాగా క్లీన్ చేసిన వారికి 25వేల వోచర్ లభిస్తుంది. విశ్వ, సిరి ఒక జంటగా, శ్రీరామ్, కాజల్ ఒక జంటగా ఏర్పడి స్టౌవ్ క్లీన్ చేశారు. ముందుగా క్లీన్ చేసిన విశ్వ, సిరి 25వేల వోచర్‌ని గెలుచుకున్నారు. అనంతరం ఇంటి సభ్యులంతా దీపావళి సంబరాలు చేసుకున్నారు.
also read: RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్.. `ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్