హీరో సూర్య తలకి గాయం, 'రెట్రో' సినిమా షూటింగ్‌లో ఏం జరిగింది? నాజర్ చెప్పిన రహస్యం.

రెట్రో సినిమా షూటింగ్‌లో సూర్య తలకి పెద్ద దెబ్బ తగిలిందని ఎవికైనా తెలుసా? ఇన్ని రోజులు ఎవరికీ తెలియని ఈ రహస్యాన్ని సీనియర్ నటుడు వెల్లడించారు. ఇంతకీ సూర్యకు ఏమయ్యింది? 

Suriya head injury during Retro movie shoot revealed by Nasser in telugu jms

స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా 'రెట్రో' షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడట. ఈ విషయం లేట్ గా బయటకొచ్చింది. సీనియర్ నటుడు నాజర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా క్రేన్ సూర్య తలని గుద్దిందట. టెక్నికల్ లోపం వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమే అయినా, పెద్ద ప్రమాదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. “షూటింగ్‌లో కెమెరా క్రేన్ సూర్య తలని గట్టిగా గుద్దింది. అదృష్టవశాత్తూ పెద్దగా ఏమీ కాలేదు. కానీ అప్పుడు మాత్రం భయమేసింది” అని నాజర్ చెప్పాడు.

Latest Videos

Also Read:  40 వేలకు ఇంటిని తాకట్టు పెట్టి, ఎన్టీఆర్ తో సినిమా చేసిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?

సూర్య ధైర్యాన్ని, ప్రొఫెషనలిజాన్ని నాజర్ ప్రశంసించాడు. “దెబ్బ తగిలిన తర్వాత సూర్య కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఎక్కువ సమయం వృధా చేయకుండా తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. నొప్పి ఉన్నా పట్టించుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేశాడు. అతని డెడికేషన్ అభినందనీయం” అని నాజర్ అన్నాడు. పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమా కోసం  ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ సంఘటన చూపిస్తుంది.

నాజర్ ఈ విషయాన్ని 'రెట్రో' సినిమా ప్రమోషన్స్‌లో చెప్పాడు. సూర్య నటించిన 'కంగువ' సినిమాలో కూడా నాజర్ నటించాడు. 'కంగువ' డైరెక్టర్ శివ. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మితమైంది.

ఇది హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ సినిమా. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా. దిశా పటానీ హీరోయిన్. భారీ తారాగణం నటించిన ఈ సినిమా 2024 నవంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు.

Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

'రెట్రో' సినిమా పోస్టర్స్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 3డిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే షూటింగ్‌లో సూర్యకి దెబ్బ తగిలిన విషయం లేేట్ గా  బయటకు రావడంతో ... సూర్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతను క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. సూర్య ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సినిమా తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటున్నాడు. 

vuukle one pixel image
click me!