సినిమాని ఖూనీ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. నెగటివ్‌ ప్రచారంపై విజయశాంతి మాస్‌ వార్నింగ్‌

Published : Apr 19, 2025, 05:05 PM IST
సినిమాని ఖూనీ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. నెగటివ్‌ ప్రచారంపై విజయశాంతి మాస్‌ వార్నింగ్‌

సారాంశం

విజయశాంతి సినిమాల్లో ఎంత పవర్‌ఫుల్లో తెలిసిందే. ఆమె పోలీస్‌ డ్రెస్‌ వేసి లాఠీ పడితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` చిత్రంలోనూ అలాంటి పాత్రలోనే నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ ఆమె మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. తన సినిమాపై నెగటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై ఆమె ఫైర్‌ అయ్యింది. సినిమాని ఖూనీ చేస్తున్నారని, వాళ్లని క్షమించేది లేదని వెల్లడించింది.   

లేడీసూపర్‌ స్టార్‌ విజయశాంతి చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించిన ఆమె ఇప్పుడు `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీలో నటించింది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తుందని టీమ్‌ శనివారం సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో విజయశాంతి నెగటివ్‌ ప్రచారం చేస్తున్న వారికి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. 

సినిమాని ఖూనీ చేయాలని కొంత మంది దృష్ట శక్తులు పని చేస్తున్నాయి..

కొంత మంది సినిమాని డిస్టర్బ్ చేయడానికే ఉంటారు. అది వాళ్ల సంస్కారం, దానికి మనం ఏం చేయడానికి లేదు. అది వాళ్ల సాడిజం అంటారో, ఇంకేమంటారో నాకు తెలియడం లేదు. సినిమాని ఖూనీ చేయాలని కొంత మంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నారు.

వాళ్లందరికి వార్నింగ్‌ ఇస్తున్నా. దయజేసి ఇలాంటివి ఆపండి. ఇది మంచి పద్ధతి కాదు, ఏ రూపంలోనైనా మీరు వస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. థియేటర్‌కి వెళితే ఆడియెన్స్ అద్భుతంగా ఉందంటున్నారు, పాజిటివ్‌గా చెబుతున్నారు. 

వెళ్లి వాళ్లకి చెమ్చా గిరి చేసుకోండిః విజయశాంతి

వారిలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా ధీవించడం నేర్చుకోండి. మీకు ఎవరైనా వెనకాల గెలుకుతూ, ఏదో ఎక్కిస్తూ మైండ్‌ వాష్‌ చేస్తుంటే వాళ్ల వద్దకు వెళ్లి చెమ్చా కొట్టుకోండి. కానీ సినిమాని నాశనం చేసేలా ఎలాంటిది రాయోద్దు. ఏ సినిమా అయినా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఇలా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి, ఖర్చు చేసి తీస్తారు.

అలాంటి వాళ్లని, ఆ సినిమాని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా, ఇలా అందరిని బాధ పెట్టడం సరైనది కాదు. వాంటెడ్‌గా కొన్ని చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. వింటున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. ఏ సినిమా అయినా, ఏ హీరోమూవీ సినిమా అయినా ఇలా చేయడం సరికాదు. 

చిల్లర పనులు మానుకోండి.. ఇండస్ట్రీని బతకనివ్వండి..

బాగున్న సినిమాని బాగాలేదని, బాగలేని మూవీని బాగుందని చెప్పడం, నెగటివ్‌ ప్రచారం చేయడం ఏంటిది? ఇలా చేస్తే కొన్ని జీవితాలు పోతాయి. మేమంటే ఎప్పుడో వచ్చాం, నలభై ఏళ్లుగా ఉన్నాం, ఎన్నో దాటేసి వచ్చాం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌ ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు. సినిమానే లైఫ్‌గా ఉన్నారు, వాళ్ల జీవితాలతో ఆడుకోకండి.

అలాగే కోట్లు పెట్టి సినిమాని తీస్తున్న దర్శక, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్ల జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారే మిమ్మల్ని మాత్రం క్షమించకూడదు. దయజేసి కంట్రోల్‌గా ఉండండి, ఇలాంటి చిల్లర పనులు మానుకోండి, సినిమా ఇండస్ట్రీని బతికించండి` అని తెలిపింది విజయశాంతి. `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` సక్సెస్‌ మీట్‌లో తనదైన స్టయిల్లో రెచ్చిపోయింది. నెగటివ్‌ ప్రచారం చేసేవారికి అదిరిపోయే వార్నింగ్‌ ఇచ్చింది విజయశాంతి. 

read  more: 300కోట్ల సినిమాతో దుమ్ములేపి ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్న హీరోయిన్‌.. ఫ్యాన్స్ కి ఐశ్వర్య ట్రీట్‌

also read: పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? సంచలన నిర్ణయం.. నగలన్నీ ఆయనకే

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ