Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కి మరోసారి ప్రమాదం తప్పింది. ఆయన తాజాగా మరోసారి కారు ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరుగుతున్న కార్ రేసింగ్‌లో అజిత్ పాల్గొంటున్నారు. యూరోపియన్ కార్ రేస్‌లో నేడు శనివారంలో పాల్గొనగా, ఆయన కారు ప్రమాదానికి గురయ్యింది. అదుపు తప్పి సైడ్ డివైడర్‌ని గుద్దేసింది.
Ajith Kumar: `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంతో ఇటీవల కలెక్షన్ల దుమ్ములేపుతున్న హీరో అజిత్ కి మరోసారి యాక్సిడెంట్ అయ్యింది. ఆయన మరోసారి కార్ రేసింగ్‌లో పాల్గొంటూ ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో కార్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన కారు అదుపు తప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో అజిత్ ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్పగాయాలతో ఆయన బయటపడినట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఈ రేసింగ్‌కి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. 180 కి.మీ వేగంతో కార్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఈ ఘటన జరిగిందట. డివైడర్‌ని ఢీ కొట్టి కారు మళ్లీ వెనక్కి తిరిగి ముందుకు రావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఘటనలో అజిత్ కి పెద్దగా ప్రమాదం జరగలేదని, కానీ ఆయన కారు మాత్రం ముందు భాగంలో, అలాగే వెనకాల కొంత డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. కార్ రేస్ ప్రాక్టీస్‌లో ఇలాంటివి కామనే అని అజిత్ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.
అజిత్‌కి ఈ కారు ప్రమాదాలు ఇటీవలే మూడు సార్లు జరగడం గమనార్హం. జనవరిలో దుబాయ్‌లో గ్రాండ్ ప్రీ రేస్‌లో భాగంగా ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో స్వల్ప గాయాలతోనే అజిత్ బయటపడ్డారు. ఆ తర్వాత కూడా మళ్లీ ప్రమాదం జరిగింది. అయినా అవన్నీ లెక్కచేయకుండా ఆయన ఆ రేసింగ్‌లో పాల్గొన్నారు. విజేతగా నిలిచారు.
అజిత్‌కి స్వతహాగా రేసింగ్ అంటే ఇష్టం. బైక్ రేసింగ్, కార్ రేసింగ్ చేస్తుంటారు. బైక్‌పై కొన్ని వందల కి.మీటర్లు ప్రయాణించిన సందర్భాలున్నాయి. సినిమాలతోపాటు రేసింగ్‌కి కూడా ఆయన అంతే ప్రయారిటీ ఇస్తారు. కానీ ఇలాంటి ప్రమాదాలు అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కానీ వీటిని ఆయన మాత్రం తేలికగానే తీసుకుంటారని సమాచారం.
ఇక అజిత్ ఇటీవల `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అధిక్ రవిచందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. చాలా కాలం తర్వాత అజిత్ వింటేజ్ లుక్‌లో కనిపించారు. మాస్‌యాక్షన్ లుక్‌లో అదరగొట్టాడు. ఈ మూవీ ఇప్పటికే రెండు వందల కోట్ల కలెక్షన్లని దాటేసిందని తెలుస్తుంది. మున్ముందు భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది.
read more: పిల్లలు లేని విజయశాంతి తన ఆస్తులన్నీ ఎవరికి ఇవ్వబోతుందో తెలుసా? సంచలన నిర్ణయం.. నగలన్నీ ఆయనకే
also read: కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో స్టార్ అయిపోయిన హీరో ఎవరో తెలుసా? చిరంజీవి కాదు.. ఏకంగా తనకే పోటీ