ఓటీటీలో అసభ్యకరమైన కంటెంట్‌పై నిషేధం.. సుప్రీంకోర్ట్ క్రేజీ కామెంట్‌

Published : Apr 28, 2025, 05:39 PM IST
ఓటీటీలో అసభ్యకరమైన కంటెంట్‌పై నిషేధం.. సుప్రీంకోర్ట్ క్రేజీ కామెంట్‌

సారాంశం

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యకరమైన, బోల్డ్ కంటెంట్‌ ఎక్కువగా అవుతుంది. కొన్ని వెబ్‌ సిరీస్‌, సినిమాలు మరీ, షోస్‌ ఫ్యామిలీ చూడలేనంతగా ఉంటున్నాయి.  ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌ని నిషేధించాలని సుప్రీం కోర్ట్ లో పిటీషన్‌ దాఖలైంది.   

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అసభ్యకరమైన, బోల్డ్ కంటెంట్‌ ఎక్కువగా అవుతుంది. కొన్ని వెబ్‌ సిరీస్‌, సినిమాలు మరీ, షోస్‌ ఫ్యామిలీ చూడలేనంతగా ఉంటున్నాయి. మరీ అసభ్యకరంగా పెరుగుతుంది. బోల్డ్, క్రైమ్‌ అంశాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇలాంటి కంటెంట్‌ని నిషేధించాలని సుప్రీం కోర్ట్ లో పిటీషన్‌ దాఖలైంది. తాజాగా దీనిపై సుప్రీంకోర్ట్ స్పందించింది. ఎవరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యింది.

ఓటీటీలో అశ్లీల కంటెంట్‌పై నిషేధం.. సుప్రీం కోర్ట్ క్రేజీ రియాక్షన్‌

సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవై, అగస్టిన్‌ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారిస్తూ, ఈ సమస్యని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడానికి శాసనసభ, కార్యనిర్వాహక వర్గం బాధ్యత అని పేర్కొంది. ఇది మా పరిధిలో లేదు. మేం శాసన, కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమిస్తున్నామని, చాలా ఆరోపణలున్నాయి` అని ఇటీవల న్యాయవ్యవస్థపై వచ్చిన వ్యతిరేకతని ప్రస్తావిస్తూ జస్టిస్‌ గవై ఈ విషయాన్ని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెమతా స్పందిస్తూ, ప్రభుత్వం దీనిని వ్యతిరేక వ్యాజ్యంగా పరిగణించదని అన్నారు. ఆర్టికల్‌ 19(2) ని జాగ్రత్తగా చూసుకునే వరకు మేం వాక్‌ స్వేచ్ఛను సమతుల్యం చేసే దానితో ముందుకు వెళ్తామన్నారు. కొన్ని విషయాలు అశ్లీలంగా ఉండటమే కాకుండా వికృతమైనవి అని కూడా మెహతా తెలిపారు. ఈ విషయంలో కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ మరికొన్నింటి గురించి ఆలోచిస్తామన్నారు. 

ఓటీటీలకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని ఆందోళన

పిటిషనర్ల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ దీనిపై మాట్లాడుతూ, ఇది వ్యతిరేఖ వ్యాఖ్యం కాదని, ఓవర్‌ ది టాప్‌(ఓటీటీ), సోషల్‌ మీడియాలో ఇలాంటి కంటెంట్‌పై పిటిషన్‌ తీవ్రమైన ఆందోళనని లేవనెత్తిందని అన్నారు. ఎలాంటి తనిఖీలు, పరిమితులు లేకుండా ఇలాంటి కంటెంట్‌ ఓటీటీలో ప్రదర్శించబడుతుందని జైన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో పిల్లలు వీటన్నింటికీ ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నారని తెలిపారు.  దీనిపై మీరు ఏదైనా చేయాలని కోర్ట్ ని కోరారు. 

దీనికి మెహతా స్పందిస్తూ, కొన్ని కంటెంట్‌ లు చాలా వికృతంగా ఉంటుందని, ఇద్దరు రెస్పెక్టెడ్‌ మెన్స్ కలిసి కూర్చొని కూడా చూడలేరని, ఇలాంటి కార్యక్రమాలు 18 ఏళ్లు పైబడిన వీక్షకుల కోసం మాత్రమే అనే షరతు పెట్టవచ్చు కానీ, పూర్తిగా నియంత్రించలేమని మెహతా తెలిపారు. 

read  more: రాజమౌళి సంచలన మూవీలో నాని, అఫీషియల్‌గా కన్ఫమ్‌ చేసిన జక్కన్న

also read: కొత్తగా వచ్చే లేడీ సింగర్లపై మ్యూజిక్‌ డైరెక్టర్ల వేధింపులు.. నిజాలు ఒప్పుకున్న కీరవాణి

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!