`జింఖానా` మూవీ 3 రోజుల తెలుగు కలెక్షన్లు.. టాలీవుడ్‌ సినిమాలకు పెద్ద ఝలక్‌

Published : Apr 28, 2025, 04:51 PM IST
`జింఖానా` మూవీ 3 రోజుల తెలుగు కలెక్షన్లు.. టాలీవుడ్‌ సినిమాలకు పెద్ద ఝలక్‌

సారాంశం

మలయాళ చిత్రాలు ఎప్పుడూ సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటాయి. చిన్న బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు పెద్ద విజయాలు సాధించి ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య వచ్చిన `ప్రేమలు`, `మంజుమేల్‌ బాయ్స్` వంటి చిత్రాలు ఆ కోవలోనే హిట్‌ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్ ని అలరించాయి. ఇప్పుడు మరో మూవీ తెలుగు నాట సందడి చేస్తుంది. అదే `జింఖానా`. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్ల దిశగా వెళ్తుంది.   

`ప్రేమలు` ఫేమ్‌ నస్లేన్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ `జింఖానా` ఇప్పుడు తెలుగులో రచ్చ చేస్తుంది. ఈ మూవీ ఇప్పటికే మలయాళంలో విడుదలై అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో దీన్ని ఈ శుక్రవారం(ఏప్రిల్‌ 25న) తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ పాజిటివ్‌ టాక్‌తో వెళ్తుంది. డీసెంట్‌ కలెక్షన్లని నమోదు చేయడం విశేషం.  

`జింఖానా` మూవీ తెలుగు మూడు రోజుల కలెక్షన్లు 

ఈ మూవీ మూడు రోజుల్లోనే 3.71కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ మూవీకి ఈ స్థాయి కలెక్షన్లు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. థియేటర్ల వద్ద దీనికి మంచి స్పందన లభిస్తుంది. మున్ముందుకు కూడా అదే జోరు కనిపించేలా ఉందని టీమ్‌ చెబుతుంది. అయితే ఈ మూవీ తెలుగు చిత్రాలకు పెద్ద షాకే ఇస్తుంది. వాటిని దాటి దీనికి కలెక్షన్లు రావడం విశేషం. 

తెలుగు సినిమాలకు పోటీ ఇస్తున్న `జింఖానా`

ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ప్రియదర్శి `సారంగపాణి జాతకం`, సంపూర్ణేష్‌ బాబు `సోదర` వంటి చిత్రాలున్నాయి. అలాగే చిన్నా చితకా చాలా మూవీస్‌ విడుదలయ్యాయి.  వాటిలో ప్రియదర్శి `సారంగపాణి జాతకం` కామెడీ చిత్రంగా అలరిస్తుంది. మంచి కలెక్షన్లతోనే రన్‌ అవుతుంది. అయినప్పటికీ దీనికి `జింఖానా` మూవీ పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. 

12వ తరగతిలో ఫెయిల్‌.. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ అడ్మిషన్‌

నస్లేన్‌తోపాటు లక్‌ మన్‌ అవరన్‌, గణపతి ఎస్‌ పొడువల్‌, సందీప్‌ ప్రదీప్‌, అనఘు రవి వంటి వారు నటించిన `జింఖానా` మూవీకి ఖలీద్‌ రెహమాన్‌ దర్శకత్వం వహించారు. అలప్పుజాకి చెందిన ఆకతాయి కుర్రాళ్లలో ఒకరు తప్ప అంతా 12వ తరగతిలో ఫెయిల్‌ అవుతారు. డిగ్రీ చదవలేరు. దీంతో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్‌ పొందేందుకు ప్రయత్నిస్తారు. అందుకు బాక్సింగ్‌ ఆటని ఎంచుకుంటారు. మరి అందులో ఎలా రాణించారనేది ఈ మూవీ కథ. ఆద్యంతం ఫన్నీగా ఈ మూవీని తెరకెక్కించారు. సెకండాఫ్‌లో కామెడీ వర్కౌట్‌ అయ్యింది. అదే ఆడియెన్స్ ని అలరిస్తుంది. 

read  more;కొత్తగా వచ్చే లేడీ సింగర్లపై మ్యూజిక్‌ డైరెక్టర్ల వేధింపులు.. నిజాలు ఒప్పుకున్న కీరవాణి

also read: రాజమౌళి సంచలన మూవీలో నాని, అఫీషియల్‌గా కన్ఫమ్‌ చేసిన జక్కన్న


 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు