శ్రీవిష్ణు ప్రస్తుతం నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారారు. శ్రీవిష్ణు కామెడీ జోనర్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ రాణిస్తున్నారు. ట్రెండీగా అనిపించే కాన్సెప్ట్ లతో శ్రీవిష్ణు ఫన్ మాయాజాలం సృష్టిస్తున్నాడు. శ్రీవిష్ణు చివరగా సామజవరగమన, స్వాగ్, ఓం భీం బుష్ లాంటి చిత్రాల్లో నటించాడు. సామజవరగమన సూపర్ హిట్ అయింది. స్వాగ్, ఓం భీం బుష్ పర్వాలేదనిపించాయి.
ఈ సమ్మర్ లో నవ్వుల జల్లులు కురిపించేందుకు శ్రీవిష్ణు వచ్చేస్తున్నాడు. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కేతిక శర్మ, ఇవన హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది.
ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీతో పొట్ట చెక్కలు కావడం ఖాయం అనిపిస్తోంది. ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి. ట్రైలర్ లో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచాయి. యువతకి నచ్చే కామెడీ పంచ్ డైలాగులు ట్రైలర్ లో బాగా పేలాయి. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపి ఆ తర్వాత చిక్కుల్లో పడ్డ కుర్రాడి కథలా #సింగిల్ చిత్రం అనిపిస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో హైలైట్ అయిన బుల్లిరాజు కూడా #సింగిల్ చిత్రంలో ఉన్నాడు. ట్రైలర్ లో కొన్ని సెకన్లు కనిపించాడు. ఈ చిత్రంలో కేతిక శర్మ పేరు పూర్వ. ఒక జ్యోతిష్యుడిని కలిశాను నాకు కాబోయే భార్య పేరు P తో స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు అని శ్రీవిష్ణు కేతికతో అంటాడు. వెంటనే ఆమె తన పనిమనిషిని.. పార్వతి 2 కాఫీ తీసుకురా అని పిలవడం నవ్వులు పూయించే విధంగా ఉంది. ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు.. రిచ్ అని తుమ్మడు అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ కి పగలబడి నవ్వడం ఖాయం.
పావురాలు కుర్రు కుర్రు అని ఎందుకు అంటాయో తెలుసా రా.. ఓ మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బతుకు మంచు కురిసిపోతుందని కుర్రు కుర్రు అని అంటాయి రా అంటూ శ్రీవిష్ణు చెప్పే కామెడీ డైలాగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఓవరాల్ గా శ్రీవిష్ణు #సింగిల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. యువతని ఆకర్షించే అంశాలు మెండుగా ఉన్నాయి. శ్రీవిష్ణుకి మరో హిట్ గ్యారెంటీ అని అప్పుడే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.