
పోర్న్ స్టార్ సన్నీ లియోనీకి బాలీవుడ్ లోనే కాక దేశమంతా ఎంత క్రేజ్ వుందో తెలిసిందే. ఆక్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ కండోమ్ తయారీ కంపెనీ సన్నీ ఫొటోతో కూడిన ఓ వెరైటీ హోర్డింగ్ ను రూపొందించింది. దీన్ని దేశమంతా అనేక చోట్ల పెద్ద పెద్ద హోర్డింగులలో పెట్టారు. దేశవ్యాప్తంగా ఈ కండోమ్ యాడ్‌పై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నవరాత్రులను లింక్ పెట్టి ఇటీవల కండోమ్‌లపై చేసిన యాడ్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు గుజరాత్‌లో దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ ఫ్లెక్సీల ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. 'కమ్ ప్లే నవ్ రాత్రి.. బట్ విత్ లవ్' అంటూ వెలసిన ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని సూరత్‌కు చెందిన ‘హిందూ యువ వాహిని’ ఆందోళనకు దిగింది. పండగ సమయంలో ఈ సెక్స్ ప్రచారం ఏంటనీ, ఆ హోర్డింగ్‌లను తొలగించకుంటే నిరసనలు తీవ్రం చేస్తామని ఆ సంస్థ నేత నరేంద్ర చౌదరి హెచ్చరించారు. దీనిపై సన్నీ తీవ్రంగా విరుచుకుపడింది. ఆ కండోమ్ యాడ్ పై అభ్యంతరం తెలిపిన విమర్శకులకు సన్నీ లియోన్ గట్టిగా బదులిచ్చింది.
‘నాన్సెన్స్.. ఇది కూడా ఓ వివాదమేనా? అసలు అందులో వల్గారిటీ ఏముంది? అది కూడా అన్నింటిలానే ఒక మూములు ప్రకటన. కాకపోతే కాస్త విభిన్నంగా రూపొందించారు.. అంతే. సెక్స్ అనేది మనిషి జీవితంలో సగ భాగం. అది ఆరోగ్యంగా.. ఉండాలనే ఆ ప్రకటన ద్వారా చెప్పాం. ఏదో కండోమ్ వాడటం మహా పాపమైనట్టు.. దాన్ని వివాదం చేస్తే ఎలా?’ అంటూ సన్నీ తనదైన శైలిలో బదులిచ్చింది. గతంలో కేరళలోనూ సన్నీకి సంబంధించిన ఓ యాడ్‌పై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
అయితే.. వివాదం ముదురుతుండటంతో కండోమ్ తయారీ కంపెనీ మ్యాన్ కైండ్ రంగంలోకి దిగింది. ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. గుజరాత్ లో సన్నీ నవరాత్రి కండోమ్ హోర్డింగులను తొలగిస్తోంది. ఇప్పటికే 500 హోర్డింగులకు పైగా తొలగించినట్లు సంస్థ తెలిపింది.