హిరో శ్రీకాంత్ ఇంటిపై దాడి, కార్లు ధ్వంసం, బీభత్సం

First Published Sep 24, 2017, 5:12 AM IST
Highlights
  • హిరో శ్రీకాంత్ ఇంటిపై దాడి
  • ఖరీదైన కార్లు ధ్వంసం, బీభత్సం
  • గతంలో వంటపని చేసిన వెంకటేశ్ అనే వ్యక్తి కారణమని ఫిర్యాదు

ఇటీవలే యుద్ధం శరణం సినిమాలో నెగెటివ్ రోల్ లో విలన్ గా నటించి మెప్పించిన సినీ హీరో శ్రీకాంత్... గతంలో ఇంట్లో గతంలో వంట మనిషిగా పనిచేసిన వెంకటేష్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ ఇంట్లో పార్క్ చేసి వున్న కార్లపై వెంకటేష్ దాడి చేసి రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. శ్రీకాంత్ ఇంట్లో వెంకటేష్ గతంలో వంటమనిషిగా పని చేసిన నేపథ్యంలో తలెత్తిన వివాదం కారణంగానే ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలోనే వెంకటేష్ ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.
 

ఇంటి గేటు తెరిచి పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసి వున్న బీఎండబ్ల్యూ, ఐ టెన్ కార్ల అద్దాలని వెంకటేష్ బండరాయితో మోదీ ధ్వంసం చేసినట్టుగా శ్రీకాంత్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు వెంకటేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీకాంత్‌పై వెంకటేష్ అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు ? దాడికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి వుంది.

click me!