”మంగ‌ళం శ్రీను” మడతెట్టేస్తాడు

Surya Prakash   | Asianet News
Published : Nov 07, 2021, 11:48 AM IST
”మంగ‌ళం శ్రీను” మడతెట్టేస్తాడు

సారాంశం

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. 

పుష్ప చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీ సహా అన్ని భాషల్లో పాన్ ఇండియా రేంజులో విడుదల చేయటానికి రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే పుష్పరాజ్ లుక్ కి, రష్మిక మందన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విలన్  ఫహద్ ఫాజిల్ ఇంట్రో లుక్ కి కూడా  కేక పెట్టించింది. తాజాగా వదిలిన సునీల్ లుక్  కూడా మామూలుగా లేదు. సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తోంది. ఈ లుక్ చూడగానే పుష్పరాజ్ కే చెమటలు పట్టించటం ఖాయం అంటున్నారు! 

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, పోస్టర్లు మరియు టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర టీమ్. తాజాగా ఈ సినిమాలో సునీల్‌ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ ను చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. సునీల్‌ ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో నటిస్తుండగా…దానికి సంబంధించిన పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్‌ లో సునీల్‌… చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు.  

Also read AAA multiplex: తన వరల్డ్ క్లాస్‌ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్..

ఇక ఇన్నాళ్లూ తనదైన పంచ్ డైలాగ్స్ తో  కడుపుబ్బా నవ్వించి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌.. ఇప్పుడు తన లుక్స్‌తో అందర్నీ భయపెడుతున్నారు.  ‘‘రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌’’ అని టీమ్‌ పేర్కొంది. ఇందులో సునీల్‌ మునుపెన్నడూ లేనివిధంగా ఎరుపెక్కిన కళ్లతో సీరియస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. సునీల్‌ లుక్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. షాక్ అవుతున్నారు.

Also read Sai dharam tej: సాయి ధరమ్ తేజ్ లో ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది!

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. విలన్ గా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan v/s Pawan Kalyan: పెద్ది మూవీ వాయిదా? బాబాయ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కోసం చరణ్‌ వెనక్కి
Illu Illalu Pillalu Today Episode Jan 24: ఇడ్లీ బాబాయిని చంపేస్తానన్న విశ్వక్, రాత్రికి అమూల్య జంప్?