Jai Bhim controversy: చెంప పగలగొట్టే సీన్ పై ప్రకాష్ రాజ్ రియాక్షన్, అదిరిపోయే కౌంటర్

By telugu team  |  First Published Nov 7, 2021, 10:04 AM IST

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏం చేసినా వివాదంగా మారుతోంది. క్రేజీ హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏం చేసినా వివాదంగా మారుతోంది. క్రేజీ హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే ఈ చిత్రంలో ఓ సన్నివేశం విషయంలో వివాదం మొదలయింది. మూవీలో Prakash Raj పోలీస్ అధికారిగా ఐజి పెరుమాళ్ స్వామి పాత్రలో నటించారు. కేసు గురించి విచారణ జరుపుతున్న సమయంలో హిందీలో మాట్లాడుతున్న వ్యక్తిని తెలుగులో మాట్లాడమని చెంప పగలగొడతాడు. ఈ సన్నివేశం వివాదంగా మారింది. హిందీ భాషని అవమానించే విధంగా సీన్ క్రియేట్ చేశారు అంటూ విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. 

Latest Videos

undefined

ఈ వివాదంపై ప్రకాష్ తన సైలెన్స్ బ్రేక్ చేశాడు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..Jai Bhim  చిత్రం చూశాక వాళ్లకు గిరిజనుల ఆవేదన కనిపించలేదా, వాళ్లకు జరుగుతున్న అన్యాయం కనిపించలేదా.. వాళ్లకు కేవలం చెంపదెబ్బ సన్నివేశం మాత్రమే కనిపించింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు విమర్శలు చేస్తున్న వారి అజెండా ఏంటో అని' అంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. 

Also Read: ట్రెండింగ్‌లో జస్టీస్‌ కె చంద్రు.. గూగుల్‌ సెర్చ్‌లోనూ టాప్‌.. `జై భీమ్‌` సినిమా ఎంత పనిచేసింది..

ప్రకాష్ రాజ్ ఇంకా మాట్లాడుతూ.. ఆ సన్నివేశం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే.. హిందీని తమపై బలవంతంగా రుద్దారనే కోపం సౌత్ లో ఉంది. పోలీస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు తప్పించుకునేందుకే ఆ వ్యక్తి హిందీలో మాట్లాడతాడు. అలాంటప్పుడు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి ఇంకెలా రియాక్ట్ అవుతాడు ? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 

అసలు ఈ వివాదం గురించి స్పందించాల్సిన అవసరమే లేదు. నేను ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొంట్టడం కొంతమందికి మాత్రమే కోపం తెప్పించింది. ఎందుకంటే నేను ప్రకాష్ రాజ్ ని కాబట్టి. నన్ను సులభంగా వివాదాల్లోకి తీసుకురావచ్చు కాబట్టి అని ప్రకాష్ రాజ్ ఘాటుగా బదులిచ్చారు. 

Also Read: జాకెట్ లేకుండా ఎద పైటతో దాస్తూ హీటేక్కిస్తున్న మాస్టర్ బ్యూటీ మాళవిక... వింటేజ్ లుక్ లో కేక పుట్టించిన అమ్మడు

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ Suriya కి సహకరిస్తూ నిజాలని నిగ్గుతేల్చే నిజాయతి గల పోలీస్ అధికారిగా నటించారు. చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తమిళనాడులో 1990 దశకంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో జస్టిస్ చంద్రు గిరిజన మహిళకు అండగా కోర్టులో పోరాటం చేశారు. ఆ పాత్రని సూర్య పోషించారు. ఇక ఈ చిత్రంలో అందరిని ఆకట్టుకుంటున్న మరో పాత్ర సినతల్లి.  ఈ పాత్రలో గిరిజన మహిళగా మలయాళీ నటి లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది. ఆమె పాత్రతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఈ మూవీలో ప్రభుత్వ సినీయర్ న్యాయవాదిగా రావు రమేష్ నటించారు. 

click me!