Priyamani: ముస్తఫా రాజ్ తో ప్రియమణి విడాకులు?... ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో క్లారిటీ!

Published : Nov 07, 2021, 10:04 AM ISTUpdated : Nov 07, 2021, 10:08 AM IST
Priyamani: ముస్తఫా రాజ్ తో ప్రియమణి విడాకులు?... ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో క్లారిటీ!

సారాంశం

ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య గొడవలు చెలరేగాయని, అందుకే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ పుకార్లకు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రియమణి క్లారిటీ ఇచ్చారు. 

హీరోయిన్ ప్రియమణి భర్తతో విడిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్ల నుండి విడిగా ఉంటున్న ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోనున్నారని పుకార్లు రావడం జరిగింది. ప్రియమణి (Priyamani)-ముస్తఫా రాజ్ 2017 లో వివాహం చేసుకున్నారు. 

ముస్తఫా రాజ్ (Mustafa raj) కి ఇది రెండో వివాహం. కాగా ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని మొదటి భార్య ఆరోపిస్తున్నారు. అలాగే ఆమె కోర్ట్ ద్వారా న్యాయపోరాటం చేస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే ముసఫా రెండో వివాహం చేసుకున్నారని, చట్టరీత్యా ఇది చెల్లదు అంటూ... ఆమె వాదిస్తున్నారు. ముస్తఫా రాజ్ మొదటి భార్య తరపున వాదిస్తున్న లాయర్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ముసఫా రాజ్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమెకు భరణం క్రింద కొంత అమౌంట్ చెల్లించడంతో పాటు, పిల్లల పోషణ బాధ్యత తీసుకున్నట్లు వాదిస్తున్నారు. ఆమెతో తనకు సెటిల్మెంట్ అయిపోయింది అనేది, అతడి ఆరోపణ.

 Also read జాకెట్ లేకుండా ఎద పైటతో దాస్తూ హీటేక్కిస్తున్న మాస్టర్ బ్యూటీ మాళవిక... వింటేజ్ లుక్ లో కేక పుట్టించిన అమ్మడు
ఈ విషయంలోనే ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య గొడవలు చెలరేగాయని, అందుకే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ పుకార్లకు ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రియమణి క్లారిటీ ఇచ్చారు. దీపావళి వేడుకలు భర్త ముస్తఫా, అతని కుటుంబ సభ్యులతో ప్రియమణి కలిసి జరుపుకున్నారు. తమ ఫ్యామిలీ పండుగ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. దీంతో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని రుజువైంది. 

Also read Sudigali sudheer: సుడిగాలి సుధీర్ పెళ్ళికి సర్వం సిద్ధం... అనూహ్యంగా అమ్మాయి ఎవరంటే...?
వృత్తి రీత్యా ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.. కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఆయన ప్రొఫెషన్ కోసం అక్కడ గడుపుతున్నారు. నటిగా ఫుల్ బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాలో ఉంటున్నారు. అలా వారిద్దరూ ప్రొఫెషనల్ లైఫ్ కోసం విడివిడిగా ఉంటున్నారు. మరోవైపు తెలుగులో ప్రియమణి లేడీ నక్సల్ గా నటించిన విరాట పర్వం (Virataparvam) విడుదల కావాల్సి ఉంది. రానా-సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే