మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు-సుమంత్

Published : Nov 03, 2016, 11:40 AM ISTUpdated : Mar 24, 2018, 12:10 PM IST
మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదు-సుమంత్

సారాంశం

మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటున్న సుమంత్ గతంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లాడిన సుమంత్ తెలుగులో నరుడా డోనరుడా పేరుతో వస్తున్న విక్కీ డోనర్ లో హీరోగా సుమంత్

ఇక మళ్లీ పెళ్లి అన్న ప్రసక్తే లేదు' అంటున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. 'తొలిప్రేమ' చిత్రం హీరోయిన్ కీర్తిరెడ్డిని గతంలో సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వివాహం అయిన కొన్నాళ్లకే ఇద్దరి మధ్యా మనస్పర్థలు చోటుచేసుకోవడంతో అనతి కాలంలోనే విడిపోయారు. అప్పటి నుంచీ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఇదే విషయం ప్రస్తావించి పెళ్లి గురించి అడిగితే, ఇక మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు. తన దృష్టి అంతా సినిమాలపైనేననీ, మంచి కథలతో కూడిన సినిమాలు చేయడానికే ప్రాధాన్యతనిస్తానని అన్నాడు. సుమంత్ తాజాగా నటించిన 'నరుడా డోనరుడా' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

The Raja Saab కథ లీక్‌ చేసిన ప్రభాస్‌, హైలైట్‌ ఇదే.. తాను పనిచేసిన డైరెక్టర్స్ గురించి క్రేజీ వర్డ్స్
Prabhas: పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన ప్రభాస్‌, ఎవరూ ఊహించరు.. `స్పిరిట్‌` లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌