
సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ నుండి మెగాభిమానులు, ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు... తిప్పుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈచిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 9న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 2న సినిమా విడుదలవుతుంది.
'ధ్రువ' సినిమా ఒక్క సాంగ్ మినహా మిగతా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగిలిన ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించడం నిన్ననే మొదలెట్టారు. కొన్నిరోజుల పాటు ఈ సాంగ్ ను తెరకెక్కించనున్నారు. బోస్కో - క్యాసర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీని అందిస్తున్నారు. సినిమాకి ఈ ఇంట్రో సాంగ్ ప్రత్యేకంగా నిలవనుంది. దీని కోసం కొరియో గ్రాఫర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే తన లుక్.. ఫిట్ నెస్ విషయంలో చరణ్ కూడా తగిన శ్రద్ధ తీసుకున్నాడు. ఈ సాంగ్ లో వెరైటీ స్టెప్స్ తో చరణ్ అదరగొట్టేస్తున్నాడని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా రకుల్ కనువిందు చేయనుంది.