
తనతో పాటే ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ ప్రీత్ పెద్ద పెద్ద ఛాన్సులతో దూసుకెళ్లిపోతుంటే.. రాశిఖన్నా మాత్రం టాప్ లీగ్ కు దూరంగానే ఉండిపోయింది. ఐతే ఈ ఏడాది రాశి చేసిన సినిమాలన్నీ ఆడేస్తుండటం.. గ్లామర్ డోస్ పెంచడం.. ఈ మధ్య కొంచెం బరువు కూడా తగ్గడంతో రాశి మీద దర్శక నిర్మాతల అభిప్రాయం మారుతున్నట్లుంది.
కెరీర్లో బిగ్గెస్ట్ ఆఫర్ దిశగా రాశి అడుగులేస్తున్నట్లు సమాచారం. ఆమె తొలిసారిగా ఓ పెద్ద స్టార్ తో సినిమా చేయబోతోందట. ఆ హీరో మరెవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమాకు రాశిని పరిశీలిస్తున్నారు. ఆమెకు ఆల్రెడీ ఆడిషన్ కూడా జరిగింది. సుక్కు ఆమె పట్ల సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఛాన్స్ దక్కితే రాశి కెరీర్ మలుపు తిరిగినట్లే. సుక్కు సినిమాలో హీరోయిన్లకు మంచి రోల్స్ ఉంటాయి. బాగా చేస్తే మంచి పేరొస్తుంది. చరణ్ తో చేసి మెప్పిస్తే.. ఇక మిగతా స్టార్ హీరోల పక్కన కూడా ఆటోమేటిగ్గా ఛాన్సులొచ్చేస్తాయి. మరి ఈ అవకాశాన్ని రాశి ఒడిసిపట్టుకుంటుందో లేదో చూడాలి.