తిరిగొస్తే సఫా చేస్తామని సుచీలీక్స్ సుచిత్రకు వార్నింగ్...

Published : Apr 06, 2017, 11:05 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
తిరిగొస్తే సఫా చేస్తామని సుచీలీక్స్ సుచిత్రకు వార్నింగ్...

సారాంశం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుచీలీక్స్ సంచలనం స్టార్ హీరోహీరోయిన్ల రాసలీలల లీకేజీతో సెన్సేషన్ వార్నింగులతో దేశం విడిచి వెళ్లిన సుచిత్ర తిరిగొస్తే చంపేస్తామని సీరియస్ వార్నింగ్స్

దక్షిణాది సినీ పరిశ్రమల తారల్ని కుదిపేసిన ఘటన ఏదైనా ఉంటందే ఇటీవల అధి సుచీలీక్స్ వ్యవహారం ఒక్కటే. ఈ వ్యవహారంతో పలువురు దక్షిణాది బడా స్టార్లకు భారీగా డామేజీ అయింది. ఆ డామేజీ నుంచి కోలుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న సదరు టాప్ స్టార్స్ సుచీలీక్స్ మళ్లీ కనిపిస్తే అంతు తేల్చేస్తామని సుచిత్రకు వార్నింగ్ కూడా గట్టిగా ఇప్పించారట.

 

దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్ తారలను కుదిపేసిన సుచీ లీక్స్‌తో... ఫలానా హీరోలు, హీరోయిన్ల చీకటి బాగోతాలు ప్రపంచానికి చూపిస్తానంటూ సింగర్‌ సుచిత్ర పెద్ద సంచలనానికే తెరలేపింది. కోలీవుడ్‌కి చెందిన కొన్ని పెద్ద తలకాయల నీలి చిత్రాలు తన వద్ద వున్నాయంటూ బెదిరించింది. కొన్ని శాంపిల్‌ వీడియోలు కూడా రిలీజ్‌ చేయటంతో వాళ్లంతా అలర్ట్‌ అయిపోయారు.

 

ఎలాగోలా సుచిత్రని ట్విట్టర్‌లో లేకుండా చేసారు. తర్వాత ఆమె భర్త నటుడు కార్తీక్‌ కుమార్‌పై ఒత్తిడి తెచ్చి ఆమె మానసిక రోగి అని చెప్పించారు. సుచిత్రని మెల్లగా దేశం దాటించేసారు. ఇక ఆమె ఇక్కడికి తిరిగి రాకూడదని గట్టి వార్నింగులు వెళ్లాయట. ఆమె కనుక మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చినా, మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించినా సుచిత్ర ఫ్యామిలీకే ప్రమాదమని, కుటుంబాన్ని నామరూపాల్లేకుండా చేసేస్తామని తీవ్రంగా హెచ్చరించారట.

 

సుచీలీక్స్ బాధితుల్లో తమిళ చిత్ర పరిశ్రమని శాసించే కుటుంబాలు, వ్యక్తులు కూడా వుండేసరికి ఇప్పుడు సుచిత్ర కెరియర్‌ పూర్తిగా నేలకరుచుకుంది. అంతే కాదు ఆమె భర్తకి కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. స్థాయికి మించిన వ్యక్తులతో వైరం పెట్టుకుంటే ఇప్పుడిలా దేశం వదిలిపోవాల్సి వచ్చింది.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్