అవసరాల "బాబు బాగా బిజీ" విడుదల వాయిదా

Published : Apr 06, 2017, 09:52 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
అవసరాల "బాబు బాగా బిజీ" విడుదల వాయిదా

సారాంశం

అవసరాల శ్రీనివాస్ బాబు బాగా బిజీ మూవీ రిలీజ్ వాయిదా సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ కోసం తపిస్తున్న బాబు బాగా బిజీ

అవసరాల శ్రీనివాస్ నటించిన సెక్స్ కామెడీ బాబు బాగా బిజీ విడుదల ఏప్రిల్ 13న విడుదల కావాల్సి ఉన్నా అది ప్రస్థుతానికి వాయిదా పడినట్టే. ఇప్పటికే మే5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ చెప్తున్నప్పటికీ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

ఎందుకంటే ఈ సినిమాలో ప్రతీ సీన్ లో డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి సెక్స్ అంటేనే బోర్ కొట్టే రేంజ్ లో తీశారట. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలాగే వదిలితే సినిమా ప్రభావం ప్రేక్షకులపై తీవ్రంగా పడే ప్రమాదముందని సెన్సార్ బోర్డు భావిస్తోందట. 

 

అయితే సెన్సార్ బోర్డు చెప్పనట్లుగా సీన్స్ అన్నీ కట్ చేస్తే సినిమా మొత్తం గందరగాళంగా మారే ప్రమాదముందని తెలుస్తోంది. అందుకే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తగ్గించి, సుప్రియ, అవసరాల శ్రీనివాస్ మధ్య చిత్రీకరించిన సీన్స్ కొన్ని కత్తిరించి తిరిగి సెన్సార్ కు వెళ్లాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

 

దీంతో సినిమా విడుదల సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పైనే ఆధారపడిందని స్పష్టమవుతోంది. మరి సెన్సార్ బోర్డు ఎప్పుడు కరుణిస్తుందో.. ఎలా కరుణిస్తుందో చూడాలి. బాలీవుడ్ చిత్రం హంటర్ కు రీమేక్ గా... తెరకెక్కించిన చిత్రమే బాబు బాగా బిజీ. సెక్స్ అంటే పడి చచ్చే ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందే బాబు బాగా బిజీ.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్