Half Lion: అల్లు అరవింద్ నిర్మాతగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బయోపిక్

Published : Dec 14, 2021, 11:39 AM ISTUpdated : Dec 14, 2021, 12:52 PM IST
Half Lion: అల్లు అరవింద్ నిర్మాతగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బయోపిక్

సారాంశం

బహుభాషావేత్త అయిన పీవీ నరసింహారావు జీవితంలో అనేక మలుపులు, మరపురాని విజయాలు ఉన్నాయి. ఈ లెజెండరీ  నాయకుడు జీవితం తెరపైకి తేవడానికి రంగం సిద్ధమైంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రకటన చేశారు. 

భారత రాజకీయాలలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)గారిది ఒక శకం. ప్రధానిగా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త ఆయన. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు ప్రధానిగా తీసుకొచ్చిన సంస్కరణలు భారత ముఖచిత్రం మార్చివేశాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వంటి కాన్సెప్ట్స్ ప్రవేశపెట్టి, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించారు. భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు.. ఆ పదవిని అలంకరించిన ఏకైక తెలుగువారు కావడం అందరికీ గర్వకారణం. 

బహుభాషావేత్త అయిన పీవీ నరసింహారావు జీవితంలో అనేక మలుపులు, మరపురాని విజయాలు ఉన్నాయి. ఈ లెజెండరీ  నాయకుడు జీవితం తెరపైకి తేవడానికి రంగం సిద్ధమైంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రకటన చేశారు. ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రకటించిన అల్లు అరవింద్... పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు. 
'హాఫ్ లైన్' (Half Lion)పేరుతో పీవీ జీవిత కథను సిరీస్ గా తెరకెక్కించనున్నారు. 

ఆహా స్టూడియోస్ తో పాటు బిర్లా గ్రూప్‌కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యారు. జాతీయ అవార్డు విజేత ప్రకాష్ ఝా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 

Also read Aadhi Pinisetty : రామ్ సినిమా నుంచి ఆది పినిశెట్టి లుక్.. హ్యాపీ బర్త్ డే యంగ్ స్టార్.

కాగా మిగతా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. పీవీ నరసింహారావు పాత్ర ఎవరు చేయనున్నారనే ఆత్రుత ప్రేక్షకులలో నెలకొంది. భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా.. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న పీవీ నరసింహారావు బయోపిక్ ప్రకటనతోనే హైప్ తెచ్చుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన