దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

By Surya PrakashFirst Published Dec 14, 2021, 11:27 AM IST
Highlights

. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాకో అనే యువకుణ్ని రూ. 8లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దహనం చేసి చంపి.. తానే చనిపోయినట్టు నాటకమాడి.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కురుప్పు. 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి రిలీజ్ తర్వాత ఇక్కడ కూడా  ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన చేసిన సినిమాలు ఇక్కడ కూడా మంచి ఓపినింగ్స్  కలెక్షన్స్‌ని అందుకుంటూ ఉంటాయి.  రీసెంట్ గా ఆయన చేసిన కొత్త చిత్రం ‘కురుప్’ విడుదలై మళయాళంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. అయితే చాలా మంది ఈ సినిమా రిలీజైందనే విషయం కూడా తెలియక చూడలేకపోయారు. వాళ్లు ఈ సినిమా ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ తేదీని ఫిక్స్ చేసారు. 

ఈ డిసెంబర్ నెల 17 నుంచి నుంచి ఈ సినిమా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా 1984లో కేరళ రాష్ట్రాన్ని గడగడలాడించిన నొటోరియస్ క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాకో అనే యువకుణ్ని రూ. 8లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దహనం చేసి చంపి.. తానే చనిపోయినట్టు నాటకమాడి.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కురుప్పు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడికోసం వెతుకుతునే ఉన్నారు కేరళ పోలీసులు.  కురుప్పుగా దుల్కర్ సల్మాన్ అద్భుతమైన పెర్ఫార్మాన్స్ ఇచ్చారు. అలాగే.. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వ ప్రతిభ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. మహానటితో తెలుగువారికి బాగా దగ్గరైన దుల్కర్ .. ఇప్పుడీ సినిమా ఓటీటి రిలీజ్ తో ఇంకెంత క్రేజ్ తెచ్చుకుంటారో చూడాలి.


చిత్రం కథేమిటంటే... కేర‌ళ‌లో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి గోపీకృష్ణన్ కురుప్ అలియాస్ జీకే (దుల్కర్ సల్మాన్) పరీక్షలో ఫెయిల్ అవటంతో వేరే దారిలేక ఇంట్రస్ట్ లేకపోయినా.. ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవుతాడు. అయితే  గోపి కృష్ణన్ ది మొదటి నుంచి కన్నింగ్ ప్రవర్తన,స్వేచ్చా జీవితం కోరుకునే వ్యక్తి. దాంతో మిలటరీలో ఇమడటం కష్టంగా ఉంటుంది. అక్కడ మందు బాటిళ్లు,షూలు అన్ని అమ్మేసి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూంటాడు.  ఈ క్రమంలో పనిమనిషి కూతురు శారదాంబ (శోభితా ధూళిపాళ)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇంక ఆ ఎయిర్ ఫోర్స్ లో ఆయుధాలు సైతం అమ్మేయటానికి స్కెచ్ వేసి దొరికిపోయే సిట్యువేషన్ వస్తుంది.

Also read RRR:ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సంతకాలతో ఎగ్రిమెంట్స్

 దాంతో తను సూసైడ్ చేసుకున్నట్లు నమ్మించి వేరే పేరుతో సుధాకర్ కురుప్ గా దుబాయి పారిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి దుబాయి నుంచి వచ్చి మరోసారి ఓ  బిగ్ క్రైమ్ చేసి తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించే ప్రయత్నం చేద్దామనుకుంటాడు. , అచ్చం తన పోలికలతో ఉండే ఓ శవాన్ని వెతికి పట్టుకుని, అది తన శవంగానే భ్రమింపచేసి ఇన్సూరెన్స్‌ డబ్బు తీసుకోవాలనుకున్నాడు.కానీ ఈ సారిపోలీస్ ల  దృష్టిలో పడిపోయాడు. అప్పుడు ఏమైంది ? అలాగే సుధాకర్ కురుప్ నుంచి మళ్ళీ అలెగ్జాండర్ గా ఎలా మారాడు ? అన్నిటికీ మించి అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ?  అత‌ని కోసం అన్వేష‌ణ ప్రారంభించిన పోలీసు అధికారుల‌కు ఎలాంటి విష‌యాలు తెలిశాయి?  చివరకు అతను ఏమి సాధించాడు ? అనేది మిగిలిన కథ.

Also read Aadhi Pinisetty : రామ్ సినిమా నుంచి ఆది పినిశెట్టి లుక్.. హ్యాపీ బర్త్ డే యంగ్ స్టార్.

click me!