Virata Parvam: విరాటపర్వం రిలీజ్ ఇప్పట్లో లేనట్టే... ఎం చెప్పారంటే..?

By Mahesh JujjuriFirst Published Dec 14, 2021, 11:30 AM IST
Highlights

విరాటపర్వం సినిమా నుంచి, రానా బర్త్ డే సందర్భంగా వాయిస్ ఆఫ్ రవన్న వీడియోను రిలీజ్ చేశారు టీమ్. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్స్ తో.. రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది ఈ వీడియో. 
 

రానా(Rana)- సాయి పల్లవి(Sai Pallavi)  జంటగా.. వేణు ఉడుగుల డైరెక్షన్ లో సురేష్ బాబు(Suresh Babu) నిర్మిస్తున్న సినిమా విరాటపర్వం. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈమూవీ నుంచి వాయిస్ ఆఫ్ రవన్న వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో ట్రీట్ ను అందించారు Virata Parvam టీమ్.  ప్రజలు బిగించిన పిడికిలి అతడు. ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని దరించిన అడవి అతడు. ఆయుధమై  కదిలిన  ఆకాశం అతడు. అరణ్య అలియాస్ 'రవన్న అంటూ పవర్ ఫుల్ ట్యాగ్ లైన్స్ తో రిలీజ్ అయిన ఈ వీడియో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. 


విరాటపర్వం సినిమా ఇప్పట్లో రిలీజ్ అయయ్యేలా కనిపించడం లేదు. ఈరోజు రిలీజ్ చేసి వీడియోలో కూడా ట్రైలర్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతన్నట్టు అనౌన్స్ చేశారు.  ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు దాటిపోయింది.రిలీజ్ కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. వాటి మధ్య రిలీజ్ చేసి... ఇబ్బంది పడటం ఎందుకు అని ఆలోచిస్తున్నారు విరాటపర్వం మేకర్స్. అందుకే ఇప్పట్లో వీరాటపర్వం(Virata Parvam) రిలీజ్ ఉండదనే తెలుస్తోంది. 


అందులోను ఈ మూవీని థియేటర్ లో కాకుండా ఓటీటీ(OTT) లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ లో విరాటపర్వం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా రెండు నెలల తరువాత.. అంటే వచ్చే ఏడాది పిబ్రవరిలో విరాటపర్వం రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందది. 1990's బ్యాక్ డ్రాప్ లో నడిచే సక్సల్స్ కథతో 2018లో  వేణు ఉడుగుల(Venu Udugula) సినిమాను ప్లాన్ చేసుకున్నారు.   


2019 జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని.. అప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకోవాలి అనకున్నారు. కాని కొన్ని రోజులు రానా అందుబాటులో లేకపోవడం. ఆ తరువాత కరోనా పరిస్థితులు సినిమాకు శాపంగా మారాయి. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. సుధాకర్ చేకూరితో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్న ఈసినిమాలో రానా- సాయిపల్లవితో పాటు ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ నవీన్ చంద్ర, ఈశ్వరీ రావ్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. సురేష్ బొబ్బిలి విరాటపర్వానికి మ్యూజిక్ అందించారు. 

Also Read : Allu arjun: ఫ్యాన్స్ మీట్‌లో పలువురికి గాయాలు.. బన్నీ క్షమాపణలు..
 

click me!