'జయమ్మ పంచాయితీ' అనే ఆసక్తికర టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించారు. ఇక మోషన్ పోస్టర్ తో మూవీ కాన్సెప్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు.
స్టార్ యాంకర్ సుమ పూర్తి స్థాయిలో నటిగా మారనున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ విషయాన్ని ఆమె ధృవీకరించారు. పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, నటించాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో ఆమె తెలియజేశారు. దీంతో తాను వెండితెర రీ ఎంట్రీకి సిద్ధమైనట్టు వెల్లడించారు. నేడు ఆమె(Suma kanakala) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
'జయమ్మ పంచాయితీ' అనే ఆసక్తికర టైటిల్ ఈ చిత్రానికి నిర్ణయించారు. ఇక మోషన్ పోస్టర్ తో మూవీ కాన్సెప్ట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు. జయమ్మ పంచాయతీ (Jayamma panchayathi) పక్కా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కే డ్రామాగా కనిపిస్తుంది. సాధారణంగా పల్లెటూళ్లలో ఉండే కట్టుబాట్లు, ప్రేమ కథలు, వాటి వలన కేసులు, పంచాయితీలు, తీర్పులు, శిక్షలు, పేద ధనిక, కులం మతం తారతమ్యాలు వంటి సామాజిక అంశాలే జయమ్మ పంచాయితీ మూవీలో ప్రధానాంశాలు అని చెప్పొచ్చు.
undefined
ఇక సుమ కనకాల లుక్ విషయాని వస్తే... పక్కా పల్లెటూరి మాస్ లేడీ గెటప్ లో ఆమె ఆకట్టుకున్నారు. ఎర్ర చీర కట్టుకొని, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఒంటిచేత్తో ఆమె పిండి కొడుతుంటే రోలు కూడా పగుళ్లు ఇచ్చింది. జయమ్మగా మూవీలో ఆమె పాత్ర ఎంత పవర్ ఫుల్ గా, రాడికల్ గా ఉంటుందో తెలియజేశారు. మొత్తంగా మోషన్ పోస్టర్ తోనే సుమ కనకాల, సినిమాపై అంచనాలు పెంచేశారు.
స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలుతున్న సుమ జయమ్మగా వెండితెర రీ ఎంట్రీతో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
నిజానికి సుమ కెరీర్ మొదలైంది కూడా నటిగానే. 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంతో ఆమె హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. పలు చిత్రాలలో యాంకర్ గా చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. కొడుకు రోషన్ కనకాలను హీరోగా పరిచయం చేయనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇక జయమ్మ పంచాయతీ చిత్రానికి విజయ్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత బలగ ప్రకాష్ నిర్మిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also read Naatu Naatu song : బ్రిటీష్ కోటలో రామ్-భీమ్ ఆటా పాటా, మారువేశాల్లో బురిడీ? మైండ్ బ్లాకింగ్ డిటైల్స్!