నాన్న కథ రాస్తే బాహుబలి3 కూడా తీస్తా... జక్కన్న ఊహించిందే చెప్తున్నాడు

Published : May 04, 2017, 01:19 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
నాన్న కథ రాస్తే బాహుబలి3 కూడా తీస్తా... జక్కన్న ఊహించిందే చెప్తున్నాడు

సారాంశం

తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తే బాహుబలి3 తీస్తానంటున్న రాజమౌళి లండన్ పర్యటనలో బాహుబలి3 పాజిబిలిటీపై రాజమౌళి కమెంట్స్ ఇప్పటికే బాహుబలి3 ఉండే అవకాశాలను స్పష్టం చేస్తున్న బాహుబలి  పార్ట్1,పార్ట్2 కథ

 

తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలిని తెరకెక్కించిన జక్కన్న బాహుబలి ది కన్ క్లూజన్ తోనే సినిమాను ఎండ్ చేసారా.. లేక మరో సీక్వెల్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్ళూ అలాంటి ఆలోచన లేదని చెప్తూ వచ్చిన జక్కన్న ఇప్పుడు నాన్న కథ రాస్తే తప్పకుండా చేస్తానంటున్నాడు. 

 

 నిజానికి 'బాహుబలి 2'తో ఈ కథ పూర్తవుతుందనీ .. 3వ భాగం ఉండదని రాజమౌళి చెబుతూ వచ్చారు. అయితే 2వ భాగానికి వచ్చిన రెస్పాన్స్ తో ఆయన 3వ భాగానికి సంబంధించిన ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తోంది. రెండవ భాగం చివరిలో తనికెళ్ల భరణికి .. చిన్న కుర్రాడికి మధ్య జరిగిన సంభాషణ కూడా 3వ భాగం వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని చెబుతోంది.

 ప్రస్థుతం యూకే టూర్లో ఉన్న రాజమౌళి మాట్లాడుతూ .. తన తండ్రి మంచి కథను సిద్ధం చేస్తే మూడవ భాగాన్ని తెరకెక్కించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కథలను అద్భుతంగా తయారుచేయడంలో విజయేంద్ర ప్రసాద్ సిద్ధహస్తులు కనుక, ఆయన 3వ భాగానికి కథ రెడీ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'బాహుబలి' మరికొన్ని భాగాలు ఉండటం మంచిదని సన్నిహితులు చెప్పడం కూడా రాజమౌళిని ఆలోచనలో పడేసిందని అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?