చిత్రీకరణ చివరిదశలో బెల్లంకొండ-బోయపాటిల సినిమా !!

Published : May 04, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
చిత్రీకరణ చివరిదశలో బెల్లంకొండ-బోయపాటిల సినిమా !!

సారాంశం

అతి త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న బెల్లంకొండ బోయపాటి సినిమా హంసలదీవిలో ఒల్లు గగుర్పొడిచే యాక్షన్ పార్ట్ చిత్రీకరణ బోయపాటి సినిమాల్లో ఇదే బెస్ట్ అంటున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది.  బెల్లంకొండ శ్రీనివాస్ కు జంటగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే హంసల దీవిలో ఓ భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకొంది. నిర్మాణానంతర కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ ను త్వరలోనే విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. "హంసల దీవిలో సాహిసురేష్ వేసిన ప్రత్యేక సెట్ లో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఓ రోమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించాం. బెల్లంకొండ శ్రీనివాస్ మొక్కవోని ధైర్యంతో డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేశాడు. చిత్ర తారాగణం అంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ సినిమాకి చాలా కీలకం. డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో "ఈ సినిమా బెస్ట్" అనే స్థాయిలో సినిమా రూపొందుతోంది. బెల్లంకొండకు మాస్ హీరో ఇమేజ్ ను తీసుకురావడంతోపాటు స్టార్ హీరోగా నిలబెట్టే చిత్రంగా ఈ సినిమా నిలిచిపోతుంది" అన్నారు. 

 

జగపతిబాబు, వాణి విశ్వనాథ్, ఎస్తేర్, సితార, సుమన్, నందు, శశాంక్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్,  పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే