వీళ్లిద్దరూ మళ్లీ కిస్ కిస్ అని మాట్లాడుకుంటారట!

Published : Oct 06, 2017, 05:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వీళ్లిద్దరూ మళ్లీ కిస్ కిస్ అని మాట్లాడుకుంటారట!

సారాంశం

స్పైడర్ లో జోడీగా నటించిన మహేష్, రకుల్ మహేష్ తదుపరి సినిమా భరత్ అను నేను కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హిరోయిన్ గా రకుల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘స్పైడర్’ మూవీలో మహేష్‌తో జోడీగా నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీలో మహేష్‌ను లైబ్రరీకి వచ్చెయ్.. అక్కడ కిస్.. కిస్ అని మాట్లాడుకుందాం అంటూ కవ్వించింది. రకుల్ లక్కీ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నా.. స్పైడర్ రిజల్ట్ కాస్త తేడాగా వచ్చినట్లు తెలిసిందే. దీని గురించి పక్కన పెడితే తాజాగా ఈ జంట మరోసారి జోడీ కట్టేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.



ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతోన్న మహేష్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. మహేష్ బాబు 25వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపించింది. అయితే పూజా ఈ సినిమాకు ఫిక్స్ కాకపోవడంతో మళ్లీ రకుల్ ను అనుకున్నారట.

 

తాజా సమాచారం ప్రకారం.. దర్శకనిర్మాతలు రకుల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు కోటికి పైగా పారితోషికం కూడా ఆఫర్ చేశారట. మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ మాత్రం కాదంటుంది. అందులోనూ రకుల్.. మహేష్‌తో కలిసి వర్క్ చేయడం తన అదృష్టంగా భావిస్తుంటుంది. రెండోసారి తనకు ఛాన్స్ రావడంతో మాటల్లేవ్.. అంతా కిస్.. కిస్ అని తెగ ఆనందపడిపోతుందట ముద్దుగుమ్మ.

PREV
click me!

Recommended Stories

Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?