సమంత, చైతూల పెళ్లి నేడే.. హనీమూన్ రద్దుకు అసలు కారణం ఇదే..!

Published : Oct 06, 2017, 01:57 AM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
సమంత, చైతూల పెళ్లి నేడే.. హనీమూన్ రద్దుకు అసలు కారణం ఇదే..!

సారాంశం

నేడే సమంత, నాగచైతన్యల పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవాలో అన్ని ఏర్పాట్లు అక్కినేని, దగ్గుబాటి రామానాయుడు, సమంత కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి అత్యంత సన్నిహితులైన 200 మంది సమక్షంలోనే వివాహ వేడుక పెళ్లి తర్వాత సినిమాలు మానే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సమంత

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో అత్యధికంగా మాట్లాడుకున్న జంట ఏదైనా వుందంటే అది సమంత,నాగచైతన్య. జోష్ తర్వాత చైతూ చేసిన ఏంమాయ చేసావెే సినిమాలో చైతూ సరసన నటించి వెండితెరకు పరిచయం అయింది సమంత. ఆ సినిమా నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరూ. ఆ తర్వాత వేర్వేరు రిలేషన్ షిప్స్ వున్నా వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగి కాలక్రమేణా ప్రేమగా మారింది. చివరకు ఇద్దరూ ఇవాళ ఒక్కటవుతున్నారు. ఇక సమంత పెళ్లికి ఒక్క రోజు ముందు తతన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి అభిమానులతో లైవ్ లో ముచ్చటించింది.

ఇక అభిమానుల సందేహాల్లో ప్రధానమైనవి.. సమంత నుంచి తెలుసుకోవాల్సినవి ఈ జంటను అభిమానించే మీ కోసం... సమంత ఇవాల్టితో.. మిసెస్ సమంత నాగచైతన్యగా మారబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులతో లైవ్ చాట్ చేయగా పలువురు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అంతే ఉత్సాహంగా సమంత సమాధానాలు చెప్పింది. ఓ అభిమాని అసలు నాగచైతన్యనే మీ సోల్ మేట్ అని ఎలా తెలుసుకున్నారని అడగ్గా... అది తొలిచూపులోని తెలిసిందని సమాధానమిచ్చింది.

 

ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి కాబోతోంది.. ఇప్పుడు మీరేం పీలవుతున్నారని అఢగ్గా.. ఓపక్క ఎక్జైటింగ్ గానూ.. మరోపక్క కాస్త నర్వస్ గానూ ఉందని సమాధానమిచ్చింది. తనకు సంతోషం, దుఃఖం రెండూ కలగలిపిన ఉద్వేగ క్షణాలతో కూడిన టైమ్ లో తానున్నానని తెలిపింది. అయితే చైతూని పెళ్లి చేసుకుని లైఫ్‌లో హ్యాపీగా సెటిల్ అవబోతున్నానన్న ఆనందం మాత్రం సమంతలో స్పష్టంగా కనబడుతోంటే మరోవైపు సమంత పెళ్లి తర్వాత ఎక్కడ సినిమాలకు దూరమవుతుందోనని ఆమె అభిమానులు ఆందోళన పడుతున్నారు.

 

లైవ్ లో సమంతకి ఓ అభిమాని నుంచి ట్విటర్ లో ఇదే ప్రశ్న ఎదురైంది. పెళ్లి తర్వాత మళ్లీ సినిమాలు చేయడం వుంటుందా అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన సమంత... "ఐ నెవర్ లెఫ్ట్(కమ్ బ్యాక్ అంటున్నారేంటి. నేనసలు సినిమాలు వదిలితే కదా)." అంటూ తెలివైన సమాధానం ఇచ్చింది. సమంత ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులకు ఆనందం కలిగించింది. దాంతో ఆమె ట్వీట్‌కి లైకుల మీద లైకులు కొట్టారు.

సమంత ప్రస్థుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు మహానటిలో కీలపాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలతో పాటు తమిళంలోనూ మరో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా వుంది. అందుకే పెళ్లి వేడుక ముగియగానే.., వెంటనే తిరిగి మళ్లీ సినిమా షూటింగులకు హాజరు కావాలని నిర్ణయించుకుంది. చైతూ కూడా ప్రస్థుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. దీంతో ఇరువురూ హనీమూన్ కోసం మరో రెండు నెలలు వెయిట్ చేసి క్రిస్ మస్ సీజన్ లో హనీమూన్ ట్రిప్ అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?