కాస్త వెయిట్ చేస్తే కావాల్సిందిస్తుందట.. లక్ష్మీరాయ్!

Published : Oct 06, 2017, 02:35 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కాస్త వెయిట్ చేస్తే కావాల్సిందిస్తుందట.. లక్ష్మీరాయ్!

సారాంశం

లక్ష్మీరాయ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన జూలీ2 కాపీరైట్ కంటెంట్ అంటూ కోర్టుకు వెళ్లిన జూలీ 1975 నిర్మాత పచీసియా చివరి నిమిషంలో జూలీ2 వాయిదా పడటంతో లక్ష్మీరాయ్ అభిమానుల నిరాశ సమయం తీసుకున్నా మీ నిరీక్షణకు తగ్గ ఫలితం వుంటుందంటూ రాయ్ ట్వీట్  

జూలీ2 మూవీతో రిలీజ్ కు ముందే బాలీవుడ్ ను షేక్ చేస్తున్న లక్ష్మీరాయ్ ఇప్పుడు ఆమె అభిమానులకే కాక బాలీవుడ్ మూవీ లవర్స్ కు కూడా నిరాశే మిగిల్చింది. తెలుగు, తమిళ   లో హీరోయిన్ గా కెరిర్ ని ప్రారంభించి ఐటెమ్ గర్ల్ గా పేరొందిన భామ రాయ్ లక్ష్మి  హీరోయిన్ గా నటించిన సినిమాలు అంతగా ఆమెను పాపులర్ చేయకపోవటంతో.. ఆమెకు ఇక్కడ పెద్దగా అవకాశాలు కూడా దక్కలేదు. దీంతో ఈ సారి ఆమె తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకోబోతోంది.  నేహా దూపియా ప్రధాన పాత్రలో పోషించిన జూలీ చిత్రానికి సీక్వెల్ గా జూలీ 2 చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

 

రాయ్ లక్ష్మి ఈ చిత్రంలో బోల్డ్ గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని ఇప్పటికే టాక్ వచ్చింది.  అంతే కాదు ఈ సినిమా విడుదలైన తర్వాత అంతా ఆమెను లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ చీక‌టి కోణాలతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. 

 

ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగడానికి చేసే ప్రయత్నంలో ప్రొడ్యూసర్లతో ఎఫైర్లు.. క్రికెటర్ తో రొమాన్సులు.. చివరకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డైరక్టర్ ఆ హీరోయిన్ జీవితంతో ఎలా ఆడుకుంటారు.. చివరకు తన సినీ లైఫ్ కి పులిస్టాప్ ఎలా పెడుతుంది.. మళ్లీ తిరిగి జనాల్లోకి సాదారణ మనిషిలా ఎలా వస్తుంది అనేది సినిమా కాన్సెప్ట్ అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.  త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో దర్శకుడు దీపక్ శివదాసాని.. కంటెంట్ ఎంత నింపాడో తెలీదు కానీ.. రాయ్ లక్ష్మి అందాలతో మాత్రం సీన్లు నింపేశాడని టాక్. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

 

అయితే ఇప్పటికే యమా క్రేజ్ సంపాదించుకున్న లక్ష్మీరాయ్ జూలీ2 సినిమా అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదావేసుకుంది. బాలీవుడ్ నిర్మాత పచీసియా గతంలో తాను జూలీ(1975) అనే సినిమాతీశానని, అందువల్ల జూలీ 2 సినిమా కూడా తనదే అవుతుందని కోర్టుకు వెళ్లటంతో.. చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది.  రీసెంట్ గా దసరా సెలవులు రావటం. వీకెండ్స్ తో పాటు గాంధీ జయంతి కూడా రావటంతో రిలీజ్ వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొందని, అయితే పపచీసియా లాంటి నిర్మాతలపై లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివన్నీ తప్పక తీసుకుని తీరతామని నిర్మాత పలాజ్ నిహలానీ స్పష్టం చేశారు. మొత్తానికి అక్టోబర్ 6న రావాల్సిన జూలీ 2 వాయిదా పడటంతో.. లక్ష్మీరాయ్ అభిమానులు నిరాశ చెందారు. అయితే.. కాస్త ఓపిక పట్టండి. మీ ఓర్పుకు తగ్గ ఫలితం అందిస్తాం అంటూ లక్ష్మీరాయ్ ట్వీట్ చేసింది.  దీంతో అభిమానులు చల్లబడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా