దుష్ప్రచారం చేయొద్దు, ప్రెస్ మీట్ పెట్టిఅన్నీ చెప్తా

By Surya PrakashFirst Published Sep 28, 2020, 7:51 AM IST
Highlights

ఈ రూమర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా  స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఎస్పీ చరణ్‌ స్పందించారు. కొంత మంది కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని  ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
 
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం  ఎస్పీబీ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వున్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన   మృతితో  అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే అదే సమయంలో ఆయన హాస్పటిల్ బిల్ విషయమై రూమర్స్ మొదలెట్టారు. ఆ రూమర్స్ లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులకు సంబంధించి చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందని, వెంకయ్య నాయుడు గారి కుమార్తె బిల్ లు పే చేసారని అని ఉంది. 

ఈ రూమర్స్ సోషల్ మీడియాలో విపరీతంగా  స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఎస్పీ చరణ్‌ స్పందించారు. కొంత మంది కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని  ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఇలా రూమర్స్ స్ర్రెడ్ చేస్తున్నవారు ఎస్పీబి అభిమానులు ఎప్పటికి కాలేరని అన్నారు. ఈ రూమర్స్ స్ర్పెడ్ చేస్తున్న వ్యక్తికు ఏ ట్రీట్మెంట్ చేసారు..ఎంత బిల్ అయ్యింది..ఎవరు బిల్ పే చేసారు వంటి విషయాలు తెలియదని అన్నారు. ఇప్పుడు నేను ఆ వివరాలు ఇవ్వబోవటం లేదు. త్వరలోనే హాస్పటిల్ మేనేజ్మెంట్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహిస్తాను అన్నారు. 
 
click me!