Sonu sood: స్టార్స్ సరిపోరూ... ఆ ఫాలోయింగ్ ఏంట్రా బాబు!

Published : Nov 28, 2021, 11:48 AM IST
Sonu sood: స్టార్స్ సరిపోరూ... ఆ ఫాలోయింగ్ ఏంట్రా బాబు!

సారాంశం

డబ్బులు ఉన్నా, దానం చేయాలన్న మనసున్నా... బాధితులను చేరుకోవడం, వాళ్ళ అవసరాలు తీర్చడం చాలా కష్టం. కానీ సోనూ సూద్ తనకంటూ ఓ పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. 

రెండేళ్ల క్రితం సోనూ సూద్ ఇమేజ్ వేరు... ఇప్పటి ఇమేజ్ వేరు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన తెలియని వారంటూ లేరు. నటుడిగా కొన్ని రాష్ట్రాలకు, చిత్ర పరిశ్రమలకు మాత్రమే తెలిసిన సోనూ సూద్.. దానకర్ణుడిగా దేశవ్యాప్తంగా ఫేమస్. ఇంతటి ఫేమ్ అతి తక్కువ కాలంలో తెచ్చుకోవడం  వెనుక ఆయన అనిర్వచనీయమైన కృషి ఉంది. ఆయనకున్న అంతులేని దానగుణం మనుషుల్లో దేవుణ్ణి చేసింది. ఏళ్ల తరబడి నటుడిగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పేదల కోసం పంచిపెడుతున్నారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా నేనున్నాను అంటూ దిగిపోతున్నారు. జస్ట్ సోషల్ మీడియాలో ఒక్క రిక్వెస్ట్ పెడితే స్పందించే వ్యక్తిని మనం ఎప్పుడైనా చూశామా? అలాంటిది ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా న్యాయమైన కోరికలు, అవసరాలు సోనూ సూద్ (Sonu sood)జస్ట్ ఒక సోషల్ మీడియా అభ్యర్థనతో తీర్చేస్తున్నాడు. 


కరోనా(Corona) క్రైసిస్ సమయంలో దేశంలో ఏర్పడిన దుర్భర పరిస్థితుల నుండి పెద్దవాళ్ళను సోనూ సూద్ కాపాడారు. ప్రభుత్వాలే విఫలం చెందితే తన సొంత డబ్బులతో పేదవారిని తమ సొంత ఇళ్లకు చేర్చాడు. ప్రత్యేకమైన రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసి దేశం నలుమూలలో చిక్కుకుపోయిన కూలీలకు ముక్తి కలిగించారు. అలా మొదలైన ఆయన సేవాకార్యక్రమాలు పలు రంగాలకు విస్తరించాయి. 

Also read NTR: ఎన్టీఆర్ పై ఆయనలా స్పందించడం అనూహ్యమే... ఇదేం ట్విస్ట్ సామీ!
డబ్బులు ఉన్నా, దానం చేయాలన్న మనసున్నా... బాధితులను చేరుకోవడం, వాళ్ళ అవసరాలు తీర్చడం చాలా కష్టం. కానీ సోనూ సూద్ తనకంటూ ఓ పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే పలు చోట్ల సోనూ సూద్ కి విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడులు కట్టి పూజిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సోనూ సూద్ ఫేమ్ ఏ స్థాయికి చేరిందో. ఇక సోషల్ మీడియాలో సోనూ సూద్ కి తిరుగులేదు. ఆయనను కోట్లమంది ఫాలో అవుతున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ లో ఆయన ఫాలోయింగ్ ఏకంగా 14 మిలియన్స్ కి చేరింది. స్టార్ హీరోలకు కూడా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. 

Also read థ‌మ‌న్ రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా…! షాకింగ్

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు