Radheshyam Song Update: ఫ్యాన్స్ కి ప్రభాస్‌ మరో గిఫ్ట్.. ఒక్క హృదయం రెండు హార్ట్ బీట్స్..

Published : Nov 28, 2021, 11:15 AM ISTUpdated : Nov 28, 2021, 11:20 AM IST
Radheshyam Song Update: ఫ్యాన్స్ కి ప్రభాస్‌ మరో గిఫ్ట్.. ఒక్క హృదయం రెండు హార్ట్ బీట్స్..

సారాంశం

మరో అప్‌డేట్‌ తో వచ్చారు ప్రభాస్‌. `రాధేశ్యామ్‌` చిత్రం నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఆ పాటకి సంబంధించిన డిటెయిల్స్ ని వెల్లడించారు. 

పాన్‌ ఇండియా రేంజ్‌ నుంచి పాన్‌ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయాడు `డార్లింగ్‌` ప్రభాస్‌(Prabhas). ఇప్పుడంతా ఆయన్ని గ్లోబల్‌ స్టార్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న భారీ సినిమా `రాధేశ్యామ్‌`(Radheshyam). ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరు పెంచింది. అభిమానుల కోరిక మేరకు ఇకపై గ్యాప్‌ లేకుండా వరుసగా అప్‌డేట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

దీనికి మరింత ఊపు పెంచింది ఇటీవల విడుదలైన `ఈ రాతలే` సాంగ్. Radheshyam నుంచి వచ్చిన తొలిసాంగ్‌.. యానిమేటెడ్‌ వీడియో ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఊహించని విధంగా సినిమా ఉండబోతుందని, గతంలో ఎప్పుడూ చూడని విధంగా సినిమా ఉండనుందనే ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో మరో అప్‌డేట్‌ తో వచ్చారు ప్రభాస్‌. ఈ సినిమా నుంచి మరో పాటని విడుదల చేయబోతున్నారు. `వన్‌ హార్ట్.. టూ హార్ట్ బీట్స్` అంటూ సాగే `లవ్‌ ఆంథెమ్‌` సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం రేపు సోమవారం(నవంబర్‌ 29)న విడుదల చేయబోతున్నారు. 

మొదటి సాంగ్‌ విషయంలో అనుకున్న టైమ్‌కి పాటని విడుదల చేయలేకపోయారు. ఇతర భాషల సాంగ్‌ మిక్సింగ్‌ విషయంలో నెలకొన్ని ఆలస్యం కారణంగా సాంగ్ విడుదల నాలుగు గంటల ఆలస్యంగా విడుదలైంది. లేట్‌ అయినా లేటెస్ట్ గా వచ్చిందనేలా ఉందా పాట. శ్రోతలను, ప్రభాస్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రెండో పాట `ఒక్క హార్ట్ రెండు గుండె చప్పుళ్లు` అంటూ సాగే పాట టీజర్‌ని రేపు రిలీజ్‌ చేయబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి హిందీ వెర్షన్‌ పాటని, సాయంత్రం ఏడు గంటలకు తెలుగు, తమిలం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభాస్‌, పూజా హెగ్డేల మధ్య ప్రేమని వ్యక్తం చేసేలా అద్భుతమైన మెలోడీగా సాగనుందని తెలుస్తుంది. దీనికి జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై యూవీ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా దీన్ని నిర్మించారు. సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. 

also read: Akhanda: ఆ విషయంలో ఎన్టీఆర్‌ తర్వాత బాలయ్యనే: బన్నీ ప్రశంసలు.. రెండు రాష్ట్రాలకు బాలకృష్ణ రిక్వెస్ట్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు