Theaters Seize: విజయనగరం జిల్లాలో 6 సినిమా థియేటర్లు సీజ్‌

Surya Prakash   | Asianet News
Published : Dec 22, 2021, 12:39 PM IST
Theaters Seize: విజయనగరం జిల్లాలో 6 సినిమా థియేటర్లు సీజ్‌

సారాంశం

ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.  

రూల్స్ కు  విరుద్ధంగా నడుస్తున్నాయంటూ.. విజయనగరం జిల్లాలో ఆరు సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేసిన సంఘటన ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.  నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేదంటూ.. సినిమా థియేట‌ర్లపై జాయింట్ క‌లెక్టర్ డాక్టర్ కిశోర్ కుమార్ కొర‌డా ఝుళిపించారు. ఆరు సినిమా హాళ్లను మూసివేయాల‌ని తాహశీల్దార్‌ను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ‌, భోగాపురం, నెల్లిమర్ల మండ‌లాల్లో ఆక‌స్మికంగా ప‌ర్యటించి.. సినిమా థియేట‌ర్లను అధికారులు త‌నిఖీ చేశారు. పూస‌పాటిరేగ సాయికృష్ణా థియేట‌ర్‌ను ఆఫీసర్లు ప‌రిశీలించారు. ఈ థియేట‌ర్‌లో ఫైర్ సేఫ్టీ లైసెన్స్ 2015 నుంచి రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డాన్ని గుర్తించి.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. థియేట‌ర్‌ను సీజ్ చేయాల‌ని తాహశీల్దార్‌ను జేసీ ఆదేశించారు.
 Alos read Pushpa : అప్పుడే 2003 కోట్లు వచ్చాయా పుష్పా,ట్రోలింగ్
ఇక భోగాపురంలోని గోపాల‌కృష్ణ థియేట‌ర్‌ను త‌నిఖీ చేసి.. సినిమా టిక్కెట్లను అధిక ధ‌ర‌ల‌కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ థియేట‌ర్‌ను కూడా సీజ్ చేయాల‌ని జేసీ ఆదేశించారు. నెల్లిమర్లలోని ఎస్ త్రి సినిమాస్ థియేటర్‌లో కూడా.. టిక్కెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో.. హాలును అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలోనే మొత్తం ఆరు థియేటర్లకు మూత వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అందుతున్న సమాచారం మేరకు ...మరిన్ని జిల్లాల్లో కూడా దాడులు జరగనున్నాయి. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా సేప్టీ నార్మ్స్ విషయంలో ముందుకు వెళ్తోంది. ఇది థియోటర్ యజమానులకు పెద్ద సమస్యగా మారనుంది. 

Also read Pushpa:'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్ పై ట్రోలింగ్
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?