సింగర్ శ్రీరామ చంద్ర బిగ్ బాస్ రెమ్యునరేషన్ లీక్... ప్రైజ్ మనీకి కొంచెం అటూ ఇటుగా

Published : Dec 22, 2021, 11:35 AM ISTUpdated : Dec 22, 2021, 11:44 AM IST
సింగర్ శ్రీరామ చంద్ర బిగ్ బాస్ రెమ్యునరేషన్ లీక్... ప్రైజ్ మనీకి కొంచెం అటూ ఇటుగా

సారాంశం

బిగ్ బాస్ ఫైనల్ కి చేరిన ఐదుగురిలో సిరికి ఐదవ స్థానం, మానస్ కి నాలుగవ స్థానం దక్కాయి. సిరి, మానస్ ఎలిమినేషన్ అనంతరం టాప్ 3లో సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ చంద్ర నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5)గ్రాండ్ గా ముగిసింది. నటుడు విజే సన్నీ టైటిల్ సొంతం చేసుకున్నారు. టైటిల్ విన్నర్ గా రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, సువర్ణ భూమి ఫ్లాట్, ఓ బైక్ గెలుపొందారు. అలాగే సన్నీ 15 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ఒప్పందం ప్రకారం పారితోషికం రానుంది. 

బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర (Srirama Chandra), మానస్, సన్నీ ఫైనల్ కి చేరడం జరిగింది. మొత్తం 19 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షోలో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు.  సింగర్ శ్రీరామ చంద్ర టైటిల్ దక్కించుకుంటాడని చాలా మంది భావించారు. ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. అనూహ్యంగా శ్రీరామ చంద్ర మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 ఫైనల్ కి చేరిన ఐదుగురిలో సిరికి ఐదవ స్థానం, మానస్ కి నాలుగవ స్థానం దక్కాయి. సిరి, మానస్ ఎలిమినేషన్ అనంతరం టాప్ 3లో సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ చంద్ర నిలిచారు. ఈ దశలో నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చారు. నాగ చైతన్య చేత గోల్డెన్ బాక్సు హౌస్ లోకి పంపారు. ఆ గోల్డెన్ బాక్సులో ఉన్న డబ్బులు తీసుకొని టైటిల్ పోరు నుండి ఒకరు నిష్క్రమించవచ్చని సలహా ఇచ్చారు. 

ఫైనల్ లో టైటిల్ దక్కేది ఒకరికే కాబట్టి, మిగతా ఇద్దరూ వట్టి చేతులతో వెళ్లడం కంటే.. ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం బెటరని నాగ చైతన్య ముగ్గురిని మోటివేట్ చేశారు. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర ఈ ఆఫర్ ని ఒప్పుకోలేదు. తర్వాత ఎలిమినేషన్ లో శ్రీరామ చంద్ర ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున ఆ బాక్సులో రూ. 20 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు.

Also read Trolling on Sunny: సన్నీపై షణ్ముఖ్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆ రెండిటి వల్లే గెలిచాడు అంటూ నిందలు

శ్రీరామ చంద్ర ఆఫర్ అంగీకరిస్తే ఆ డబ్బులు అతనికి దక్కేవి. ఇక విన్నర్ సన్నీకి ప్రైజ్ మనీగా కేవలం రూ. 30 లక్షలు దక్కేవి. అయితే శ్రీరామ చంద్ర టైటిల్ కోల్పోయినా పారితోషికం రూపంలో బాగానే రాబట్టారట. వారానికి రూ. 2 నుండి 2.5 లక్షల ఒప్పందంతో శ్రీరామ్ హౌస్ లోకి వెళ్లారు. ఆ లెక్కన దాదాపు రూ. 35 లక్షల వరకు శ్రీరామ చంద్ర బిగ్ బాస్ షో వలన ఆర్జించారట. 

Also read Bigg boss telugu 5: సిరి హన్మంత్ రెమ్యూనరేషన్ లీక్... 15 వారాలకు ఆమె ఎంత తీసుకున్నారంటే!

PREV
click me!

Recommended Stories

Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర