Pushpa : అప్పుడే 2003 కోట్లు వచ్చాయా పుష్పా,ట్రోలింగ్

Surya Prakash   | Asianet News
Published : Dec 22, 2021, 11:46 AM IST
Pushpa : అప్పుడే 2003 కోట్లు వచ్చాయా పుష్పా,ట్రోలింగ్

సారాంశం

ఈ ఆనందాన్ని పంచుకునేందుకు మంగళవారం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. 


 తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలో విడుదలైన అన్ని కేంద్రాల్లో 'పుష్ప' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాక్ తో సంభందం లేకుండా ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ ఆనందాన్ని పంచుకునేందుకు మంగళవారం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ యాంకర్ నటి ఉదయ భాను కూడా పాల్గొన్నారు. అయితే  అక్కడ ఆమె అనుకోకుండా నోరు జారిన మాట ఇప్పుడు వైరల్ అయ్యిపోయింది. పుష్ప సినిమాపై ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడింది..

ఒకప్పుడు బుల్లితెరపై తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్లలో ఉదయభాను ఒకరు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ భాను ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని వెండితెరపై కూడా సందడి చేశారు. ఇలా వెండితెరపై, బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉదయభాను గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే తాజాగా ఆమె పుష్ప చిత్రం సక్సెస్ ఈవెంట్ లో కనపడ్డారు. ఆ స్టేజీపై ఆమె పుష్ప చిత్రం 203 కోట్లు గ్రాస్ వచ్చిందని అనబోయి..పొరపాటున 2003 కోట్లు వచ్చాయని అన్నారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. యాంటి హీరో ఫ్యాన్స్ ...అల్లు అర్జున్ ని ,పుష్ప ని ఆడేసుకుంటున్నారు. అందుకు కారణం ఇప్పటికే ఈ చిత్రం కలెక్షన్స్ లో కొంత ఫేక్ అనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇలా నోరు జారటంతో మరీ హైలెట్ అయ్యిపోయింది. 

‘పుష్ప’ సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఆ ఏడుకొండల స్వామి మీ వెనకాల ఎలా ఉన్నాడో.. నా వెనక సుకుమార్ ఉండి ఇదంతా చేయించారన్నారు. ఇక రష్మికతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆమె శ్రీవల్లిగానే కాకుండా.. రష్మికగానే తనకు ఎంతో ఇష్టమన్నారు.

పుష్పలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మాట్లాడుతూ.. ఈ సినిమాలో పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డుతో పాటు అన్ని అవార్డులు ఖచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ రాకపోతే.. తాను హర్ట్ అవుతానని అంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చింపేశారంటూ కామెంట్ చేసింది.

Also read Samantha : 'ఊ అంటావా' సాంగ్ పై సమంత హాట్ కామెంట్స్.. బన్నీపై ప్రశంసల వర్షం

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఈ సినిమా  ఫస్ట్ వీకెండ్ భాక్సాఫీస్ దగ్గర అదరకొడుతోంది. నాలుగో రోజు సోమవారం కూడా అద్భుతమైన వసూళ్లు సాధించింది. సినిమాకు 4వ రోజు కూడా 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ముఖ్యంగా హిందీలోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్ల షేర్ ఉంది. ఐదో రోజు అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3 కోట్ల వరకు షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also read Pushpa:లెంగ్తీ రన్ టైం కంప్లైంట్ ,నిర్మాతల షాకిచ్చే రిప్లై

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?