గత వారం జరిగిన విషయంలో షణ్ముఖ్, సిరి బాధపడ్డారు. అలా చేయకుండా ఉండాల్సింది అంటూ షణ్ముఖ్.. సిరి వద్ద తన ఆవేదన పంచుకున్నాడు. అదే సమయంలో మళ్లీ సన్నీతో జరిగిన ఇష్యూని తీసుకొచ్చాడు.
బిగ్‌బాస్ తెలుగు 5 12వ వారం అత్యంత ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్సీ కిది చివరి వారమని బిగ్‌బాస్ చెప్పేశాడు. దీంతో కెప్టెన్ కావాలని, చివరి కెప్టెన్ గా ఉండాలని అంతా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ అనేక ట్విస్ట్‌లతో కూడిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అంతకు ముందు కాజల్, శ్రీరామ్‌ల మధ్య నిన్నటి నామినేషన్ల విషయం చర్చ జరిగింది. వీరిద్దరు గట్టిగానే వాదించుకున్నారు. కిచెన్‌లో వాదించుకునే సమయంలో నాకు స్పేస్ కావాలని శ్రీరామ్ అనడంతో నువ్వే వెళ్లిపో అని కాజల్ కౌంటర్ ఇచ్చింది. దీంతో శ్రీరామ్‌కి మతిపోయింది.
మరోవైపు గత వారం జరిగిన విషయంలో షణ్ముఖ్, సిరి బాధపడ్డారు. అలా చేయకుండా ఉండాల్సింది అంటూ షణ్ముఖ్.. సిరి వద్ద తన ఆవేదన పంచుకున్నాడు. అదే సమయంలో మళ్లీ సన్నీతో జరిగిన ఇష్యూని తీసుకొచ్చాడు. అప్పుడు అబ్జెక్ట్ చేసిన వాళ్లతోనే నువ్వు మళ్లీ మాట్లాడుతున్నావు, వాళ్ల జోకులకు నవ్వుతున్నావంటూ కామెంట్ చేశారు షణ్ముఖ్. దీంతో సిరి సారీ చెప్పింది. రాత్రి సమయంలో షణ్ముఖ్ బెడ్ పై పడుకున్న సమయంలో ఆయన వద్దకు వచ్చి హగ్ చేసుకుంది. క్షమాపణలు చెప్పింది. అదే సమయంలో సిరి రియలైజ్ అయ్యింది. తన గేమ్‌ల విషయంలో సరిగా ఆడలేదని బాధపడింది. తాను చేసిన మిస్టేక్స్ ని గుర్తు చేసుకుని బాధపడగా, ఆమెని షణ్ముఖ్ ఓదార్చాడు. ఇకపై బాగా ఆడు అంటూ సలహాలిచ్చారు.
undefined
అనంతరం నెక్ట్స్ వీక్‌కి సంబంధించి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. `నియంత మాటే శాసనం` అనేది ఈ టాస్క్ నేమ్. ఇందులో బజర్ మోగగానే నియం చైర్‌లో కూర్చొన్న వాళ్లు నియంతలాగా వ్యవహరిస్తారు. ఒక్కో గేమ్ పూర్తయిన తర్వాత మళ్లీ ఆ చైర్ కోసం పోటీపడుతూ రావాలి. ప్రతి గేమ్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. మొదట సిరి చైర్‌ని దక్కించుకుంది. ఈ సందర్భంగా బకెట్స్ ని చైన్ కి తగలించాల్సి ఉంటుంది. ఇందులో చివరగా రవి, సన్నీ నిలవగా, రవిని చేసింది సిరి. సన్నీ ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తనని ఎలిమినేట్ చేయడంపై సన్నీ ఫైర్ అయ్యాడు. రెండో గేమ్‌లో శ్రీరామ్ చైర్ దక్కించుకున్నారు. దీనికి సంబంధించిన సేవింగ్ విషయంలో కాజల్, రవి మిగిలారు.
`నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా` అని కాజల్ అడగ్గా, `నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్ అయితే ఏం చేసేదానివి` అని శ్రీరామ్ ప్రశ్నించారు. కెప్టెన్ అయితే ఫైరింజన్‌లో కూర్చోను అని తెలిపింది. ఆమె సమాధానానికి సంతృప్తి చెందని శ్రీరామ్..అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్ బ్యాండ్ వేసుకోవాలి అంటూ రవిని సేవ్ చేశాడు. అనంతరం రవి చైర్ ని దక్కించుకున్నారు. మానస్, షణ్ముఖ్‌లు ఉండగా, రవి..షణ్ముఖ్‌కి సేవ్ చేశాడు. తర్వాత పింకీ చైర్‌లో కూర్చొని నియంతగా మారింది. ఇందులో షణ్ముఖ్, శ్రీరామ్‌లు మిగలగా షణ్ముఖ్‌ని సేవ్ చేసింది.
అనంతరం మళ్లీ పింకి దక్కించుకుంది. అయితే ఇందులో సిరి తాను కూడా ముందే కూర్చున్నట్టు తెలిపింది. కానీ సంచాలక్ మానస్..పింకీకి ఇచ్చాడు. దీంతో సిరి హర్ట్ అయ్యింది. ఆమెని సేవ్ చేయోచ్చుగా, నన్ను ఎందుకు ఇలా చేయడమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎమోషనల్ అవ్వడం నచ్చలేదని సిరిని ఓదార్చాడు షణ్ముఖ్. అంతేకాదు నా ఫ్రెండ్ ఇంత వీక్ గా ఉండొద్దని మండిపడ్డాడు. మరోవైపు పింకీ సైతం ఎమోషనల్ అయ్యింది. ఈ విషయంలో సన్నీ, మానస్‌ల మధ్యే గొడవ జరగడం విశేషం.
also read: Bigg boss season 5: బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్!