Akhanda: బాలయ్య `అఖండ` రోర్‌ షురూ.. గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్

Published : Nov 23, 2021, 09:18 PM IST
Akhanda: బాలయ్య `అఖండ` రోర్‌ షురూ.. గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్

సారాంశం

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `అఖండ`. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. దీంతో  చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది. సినిమాకి సంబంధించి భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు.

బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati sreenu) కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం `అఖండ`(Akhanda). `సింహా`, `లెజెండ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల అనంతరం వస్తోన్న చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌2న విడుదల కాబోతుంది. బోయపాటి మార్క్ మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్లతో వస్తోన్న చిత్రమిది. ఈ సారి వాటికి అఘోర అనే ఎలిమింట్‌ ఈ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతుంది. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఆయన ఇలాంటి విభిన్నమైన పాత్ర పోషించడం ఇదే ఫస్ట్ టైమ్‌. దీంతో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. 

దీనికి తగ్గట్టుగానే భారీ ప్రమోషనల్‌ కార్యక్రమాలతో దూసుకుపోతుంది యూనిట్‌. ఇప్పటికే విడుదలైన Akhanda Movie టీజర్‌, ట్రైలర్‌ అంచనాలను ఆమాంతం పెంచేశాయి. బాలయ్య, ప్రగ్యాజైశ్వాల్‌ మధ్య డ్యూయెట్‌ సాంగ్‌ అదరగొడుతున్నాయి. మరోవైపు ట్రైలర్‌లో బాలయ్య విశ్వరూపం నెక్ట్స్ లెవల్‌లో ఉంది. దీనికి తోడు శ్రీకాంత్‌, జగపతిబాబు విలన్లుగా లుక్స్ గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి. బలమైన విలన్లు ఉండటంతో సినిమా మరింత రక్తికట్టిస్తుంది. 

ఇదిలా ఉంటే చిత్ర బృందం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సినిమాకి సంబంధించి భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఈ నెల 27న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. చాలా గ్యాప్‌తో ఈవెంట్‌ని నిర్వహిస్తున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బాలయ్యని వెండితెరపై చూసి రెండేళ్లు అవుతుంది. చివరగా ఆయన `రూలర్‌` చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. 

మరోవైపు బాలయ్య నటించిన `గౌతమి పుత్రశాతకర్ణి` తర్వాత సక్సెస్‌ దక్కలేదు. `పైసా వసూల్‌`, `జై సింహా`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌తోపాటు `రూలర్‌` చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ పరాజయం చెందాయి. దీంతో `అఖండ`పై భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు బాలయ్య ఫ్యాన్స్ . మరి వారి అంచనాలను రీచ్‌ అయి, బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొడతారా అన్నది చూడాలి. 

also read: `అఖండ` కోసం అఘోర పాత్రలపై రీసెర్చ్ చేశా.. హీరోలు లేకపోతే మేం జీరోః మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ షాకింగ్ కామెంట్

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే