Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్‌.. సిక్కులు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులంటూ పోస్ట్.. కేసు నమోదు

Published : Nov 23, 2021, 10:11 PM ISTUpdated : Nov 24, 2021, 08:15 AM IST
Kangana Ranaut: మరో వివాదంలో కంగనా రనౌత్‌.. సిక్కులు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులంటూ పోస్ట్.. కేసు నమోదు

సారాంశం

కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదైంది. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై మహరాష్ట్ర ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో వివాదంలో ఇరుక్కుంది. ఆమెపై ముంబయిలో కేసు నమోదైంది(Case Filed). మంగళవారం తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారంటూ సిక్కులు ముంబయిలోని ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసు కేసు నమోదు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతు చట్టాలు తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి రైతుల నుంచి వ్యతిరేకంగా వ్యక్తమవుతుంది. దీనిపై కంగనా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాలను విమర్శించే వారిపై ఫైర్‌ అయ్యారు. 

ఇప్పుడు ప్రధాని మోడీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగానూ కంగనా గళం విప్పింది. అంతటితో ఆగకుండా వరుసగా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజు.. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ఇటీవల జాతిపిత మహాత్మా గాంధీపైన కూడా పలు వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలోనూ ఆమెపై కేసు నమోదు చేశారు.  తాజాగా ఇప్పుడు కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదైంది. సిక్కు మతస్థులందరినీ ఖలిస్తానీ ఉగ్రవాదులతో పోల్చడంపై మహరాష్ట్ర ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

గురునానక్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చేశారు. అనంతరం.. కంగనా రనౌత్.. సిక్కులపై తీవ్రవ్యాఖ్యలు చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వారిని చితకబాదారని.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారందరికీ.. అలాంటి గురువు కావాలంటూ ఆమె రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటు, అన్యాయమని.. పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

కంగనా చేసిన ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ.. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ముంబైలో సీనియర్ పోలీసు అధికారులను కలిసింది. కంగన పదే పదే సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  కోరింది. సిక్కుల ఫిర్యాదు మేరకు కంగనా రనౌత్‌పై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

also read: Priyanka Chopra: అంతా తూచ్‌..ఒక్క పోస్ట్ తో `డైవర్స్` రూమర్లకి చెక్‌ పెట్టిన ప్రియాంక చోప్రా
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్