Bigg Boss 5 Grand Finale : సిరి ఎలిమినేటెడ్.. ఆమెకి ముందే తెలుసట

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 08:32 PM IST
Bigg Boss 5 Grand Finale : సిరి ఎలిమినేటెడ్.. ఆమెకి ముందే తెలుసట

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్  గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. గత 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తుది దశకు చేరుకోవడంతో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. 

కింగ్ నాగార్జున హోస్ట్  గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. గత 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తుది దశకు చేరుకోవడంతో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. వీరిలో విజేత ఎవరనేది ప్రశ్న. 

ఈ ఉత్కంఠ నడుమ ఆటపాటలతో గ్రాండ్ ఫినాలే పసందైన వినోదాన్ని అందిస్తోంది. వినేతని నిర్ణయించే క్రమంలో తొలి అడుగు పడింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లలో సిరి మొదట ఎలిమినేట్ అయింది. ఈ ఎలిమినేషన్ ని డ్రోన్స్ తో నిర్ణయించారు. దీనితో బిగ్ బాస్ ఎలిమినేషన్ కు టెక్నాలజీ జోడించినట్లు అయింది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫొటోలతో 5 డ్రోన్స్ గార్డెన్ ఏరియాలో గాల్లో ఎగిరాయి. ఈ డ్రోన్స్ లో ఎవరి ఫోటో ఉన్న డ్రోన్ హౌస్ నుంచే బయటకు వెళ్ళిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు. 

సిరి ఫోటో ఉన్న డ్రోన్ బయటకు వెళ్ళిపోయింది. దీనితో సిరి ఎలిమినేట్ అయింది. హౌస్ లో గెస్ట్ లుగా ఉన్న రష్మిక, దేవిశ్రీ సిరిని వేదికపైకి సంతోషంగా తీసుకు వచ్చారు. సిరి కూడా హ్యాపీగానే వేదికపైకి అడుగు పెట్టింది. ఇక నాగార్జున రష్మికకు హగ్ ఇచ్చి సెండాఫ్ ఇచ్చారు. పక్కనే ఉన్న దేవిశ్రీ ప్రసాద్ తనకు కూడా హగ్ కావాలని అడగడంతో.. నేను మగవాళ్లకు హగ్ ఇవ్వను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 

నాకు ఛాన్స్ ఇచ్చిన తొలి పెద్ద  హీరో నాగార్జున గారే అని దేవిశ్రీ వేదికపై తెలిపారు. అనంతరం సిరి, నాగార్జున మధ్య సంభాషణ జరిగింది. హౌస్ లో తన అనుభవాలని సిరి పంచుకుంది. తాను ఎలిమినేట్ అవుతానని ముందే తెలుసు అని సిరి తెలిపింది. అందుకే పెద్దగా టెన్షన్ పడలేదని పేర్కొంది. సిరి ఎలిమినేట్ కావడంతో ఫైనల్ రేసులో షణ్ముఖ్, మానస్, సన్నీ, శ్రీరామ్ మిగిలారు. 

Also Read: BIG BOSS-5 తప్పు చేశానని ఒప్పుకున్న సిరివాళ్లమ్మ... షణ్ముఖ్ ను రాయితో పోల్చిన తండ్రి...

PREV
click me!

Recommended Stories

Shruti Haasan: పెళ్లి చేసుకుంటే అలాగే చేసుకుంటా, మ్యారేజ్ పై తన డ్రీమ్ రివీల్ చేసిన శ్రుతి హాసన్
కెరీర్ మొత్తం అలాంటి సినిమాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్న బాలయ్య హీరోయిన్.. సూపర్ హిట్ మూవీపై విమర్శలు