Bigg Boss Telugu 5 grand finale: మానస్ ఆన్సర్ కి ఫిదా అయిన రాజమౌళి.. గెలిచింది నీవే అంటూ..

Published : Dec 19, 2021, 08:16 PM ISTUpdated : Dec 19, 2021, 08:30 PM IST
Bigg Boss Telugu 5 grand finale: మానస్ ఆన్సర్ కి ఫిదా అయిన రాజమౌళి.. గెలిచింది నీవే అంటూ..

సారాంశం

హౌస్ మేట్స్ తో రాజమౌళి ఓ గేమ్ ఆడించారు. స్టోర్ రూమ్ లో ఉన్న ఓ అస్త్రాన్ని తీసుకొచ్చి హౌస్ మేట్స్ ముందు ఉంచారు. ఆ అస్త్రాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు తమలోని అల్టిమేట్ పవర్ ఏమిటో చెప్పాలని తెలియజేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి రాకతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (Bigg Boss Telugu 5 grand finale)మరింత సందడిగా మారింది. బిగ్ బాస్ వేదిక సాక్షిగా అనేక విషయాలు రాజమౌళి ప్రేక్షకులతో పంచుకున్నారు. నాగార్జున కూడా రాజమౌళి విషయంలో తనకున్న కొన్ని సందేహాలకు సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. రాజమౌళి పేరులోని ఎస్ ఎస్ ఫుల్ ఫార్మ్ ఏమిటని అడుగగా.. శ్రీశైల శ్రీ రాజమౌళి. మొదటి ఎస్ - సక్సెస్ అయితే, రెండో ఎస్ కి అర్థం స్టుపిడ్ అన్నారు. స్టుపిడ్ అంటే నేను ఒప్పుకోనని నాగార్జున అన్నారు. సినిమా మినహా నాకేమీ తెలియదు. కాబట్టి నేను మిగతా విషయాలలో స్టుపిడ్ నే అని తెలియజేశారు. 

ఇక బిగ్ బాస్ వేదికగా పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర (Bramhastra)ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్, హీరో రన్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ రావడం జరిగింది. బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ బిగ్ బాస్ ఫినాలే వేదికపై ప్రదర్శించారు. ప్రేమ, పవర్ అనే కాన్సెప్ట్ ప్రధానంగా బ్రహ్మాస్త్ర తెరకెక్కుతుండగా... నాగార్జున కీలక రోల్ చేస్తున్నారు. ఇక అలియా, రన్బీర్ కపూర్, రాజమౌళిని ఫైనల్ కంటెస్టెంట్స్ కి పరిచయం చేశారు. సింగర్ శ్రీరామ్ ని అలియా, రన్బీర్ (Ranbir kapoor)గుర్తు చేసుకున్నారు. 

ఇక సన్నీకి అలియా (Alia bhatt)ఐ లవ్ యు చెప్పడంతో అతడు క్రిందపడిపోయాడు. హౌస్ లో ఉన్న ఓన్లీ లేదు సిరిని అలియా అభినందించారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ తో రాజమౌళి ఓ గేమ్ ఆడించారు. స్టోర్ రూమ్ లో ఉన్న ఓ అస్త్రాన్ని తీసుకొచ్చి హౌస్ మేట్స్ ముందు ఉంచారు. 

ఆ అస్త్రాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు తమలోని అల్టిమేట్ పవర్ ఏమిటో చెప్పాలని తెలియజేశారు. షణ్ముఖ్ తనలోని సహనమే తన పవర్ అని చెప్పారు. సిరి తన స్మైల్, కాన్ఫిడెన్స్ అని చెప్పారు. శ్రీరామ్.. ఒడిదుడుకులు ఓపికగా ఎదుర్కోవడం అని చెప్పగా, సన్నీ ప్రేక్షకుల ప్రేమే నా పవర్ అని తెలియజేశారు. 

Also read Bigg Boss Telugu 5 grand finale: బిగ్ బాస్ ఫినాలే.. యూనానిమస్ గా శ్రీరామ్ కి ఓటేసిన కంటెస్టెంట్స్

కాగా మానస్ ఇబ్బందికర పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. 'బి  కామ్ ఇన్ స్ట్రోమ్' అనేది నాలోని పవర్ అని తెలియజేశారు. మానస్ ఆన్సర్ నచ్చిందన్న రాజమౌళి(Rajamouli).. ఈ గేమ్ లో మానస్ గెలిచినట్లు తెలియజేశారు. అలాగే బ్రహ్మాస్త్ర ఆయుధం మానస్ గెలుచుకున్నట్లు వెల్లడించారు. ఇక తెలుగు ప్రేక్షకులను అలియా, రన్బీర్ పరిచయం చేసుకున్నారు. నాగార్జున రన్బీర్ కపూర్ ని తన కోసం తెచ్చిన గిఫ్ట్ గురించి అడిగారు. ఇక రన్బీర్ కపూర్ కుటుంబంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ దిగిన అలనాటి ఫోటోలు స్క్రీన్ పై ప్రదర్శించడం ద్వారా.. నాగార్జున అడిగిన గిఫ్ట్ ఇచ్చేశారు. రాజమౌళి బ్రహ్మాస్త్ర మూవీలో భాగం కావడంతో బిగ్ బాస్ వేదికపై ప్రమోట్ చేయడం జరిగింది. 

Also read BIG BOSS-5 తప్పు చేశానని ఒప్పుకున్న సిరివాళ్లమ్మ... షణ్ముఖ్ ను రాయితో పోల్చిన తండ్రి...

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: తండ్రి కాబోతున్న నాగ చైతన్య, శోభిత.. సమంతకు అదిరిపోయే షాక్!
Demon Pavan: రీతూ చౌదరికి రూ.5 లక్షల గిఫ్ట్ ? నాగార్జునకి మైండ్ బ్లాక్.. అందరి ముందు రివీల్ చేశాడుగా..