BIG BOSS-5 తప్పు చేశానని ఒప్పుకున్న సిరివాళ్లమ్మ... షణ్ముఖ్ ను రాయితో పోల్చిన తండ్రి...

Published : Dec 19, 2021, 07:55 PM IST
BIG BOSS-5  తప్పు చేశానని ఒప్పుకున్న సిరివాళ్లమ్మ... షణ్ముఖ్ ను  రాయితో పోల్చిన తండ్రి...

సారాంశం

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే  గ్రాండ్ గాస్టార్ట్ అయ్యింది. ఈ ఈవెంట్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా పార్టిస్పేట్ చేశారు. ఒక్కొక్కరు హౌస్ లో ఉన్న తమ వారి గురించి చెప్పుకుంటూ వచ్చారు. అందులో సిరివాళ్ల అమ్మ మాత్రం తప్పు చేశానంటూ బాధపడ్డారు.

బిగ్ బాస్5  గ్రాండ్ ఫినాలే కోసం హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన పాత కంటెస్టెంట్స్ తో పాటు .. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చారు. ఒక్కొక్కరు లోపల ఉన్న తమ వారిగురించి మాట్లాడారు. సిరి వాళ్ళ అమ్మ శ్రీదేవి వంతు వచ్చే సరికి ఆమె బాగా ఎమోషనల్ అయ్యారు. తను హౌస్ లోకి వెళ్లినప్పుడు చాలా పెద్ద తప్పు చేశానన్నారు.  అది తలుచుకుంటే చాలా బాధగా ఉందన్నారు. తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది  అన్నారని.. తాను చేసిన తప్పుకు బాధపడుతున్నా అన్నారు.

 

ఇంతకీ ఆమె దేని గురించి బాధపడుతున్నారు అంటే.బిగ్ బాస్ హౌస్ లోకి విజిట్ కోసం వెళ్ళినప్పుడు ఆమె సిరీని-షన్ముఖ్ ను ఉద్దేశించి గట్టిగా మాట్లాడారు. అంతా బాగానే ఉంది. కాని మీరు హగ్గు చేసుకోవడం బాలేదంటూ.. పదే పదే అన్నారు. హౌస్ తో పాటు చూసే ఆడియన్స్ కు కూడా చిరాకు వచ్చేలా అన్నారు. ఆ విషయాన్ని గ్రాండ్ ఫినాలో ప్రస్తావించారు శ్రీదేవి.

అటు నాగార్జున కూడా శ్రీదేవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అందులో ఏం తప్పులేదు. మీరు సిరి తల్లికాబట్టి మీకు ఉన్న భయం వల్ల అలా చెప్పి ఉంటారు. ఏ పేరెంట్స్ అయినా.. తమ పిల్లలకు ఇలానే చెప్పాలని అనుకుంటారు అంటూ నాగ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పటి వరకూ బిగ్ బాస్ లో మగవారె గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం తన కూతురు సిరి టైటిల్ విన్ అయితే చూడాలని ఉంది

అన్నారు శ్రీదేవి.

BIG BOSS5 RAJAMOULI: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది... రాజమౌళి షాకింగ్ కామెంట్స్

ఇక మిగతా పేరెంట్స్ కూడ తమ పిల్లల గురించి చెప్పుకూంటూ వచ్చారు. తన కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడని సన్నీ వాళ్లమ్మ బాధపడ్డారు. ఇక షన్ముఖ్ ఫాదర్ మాట్లాడుతూ.. తన కొడుకుని రాయిలాగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే.. తాను శిల్పంలా బయటకు వస్తున్నాడు అన్నారు. ఇప్పటి వరకూ పెద్ద కొడుక్కే బాధ్యత ఉంటుంది అనుకునేవాడిని కాని.. ఇప్పుడు షన్నుఅంతకంటే ఎక్కువ బాధ్యతతో బయటకు వస్తున్నాడన్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌