
అప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తారా అని ఓ విలేకరి అడిగినప్పుడు అసలు ఎన్టీఆర్ ఎవరో తెలియదన్నాడు తమిళ దర్శకుడు హరి. సూర్యతో సింగం సిరీస్ తీసి హ్యాట్రిక్ కొట్టిన హరి ఇప్పుడు మాట మారుస్తున్నాడు. అయితే కొన్ని సార్లు తప్పులు సరిదిద్దు కోవాలంటే,,, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవకాశాన్నే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వినియోగించుకుంటున్నాడు దర్శకుడు హరి.
గతంలో ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అంటూ ఎదురు ప్రశ్న వేసిన తమిళ దర్శకులు హరి ఇప్పుడేమో హైదరాబాద్ కు రాగానే ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అని అతడితో సినిమా చేయడానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని స్పష్టం చేశాడు. దాంతో అవాక్కవడం అందరి వంతు అయ్యింది. ఇటీవల హరి దర్శకత్వం వహించిన చిత్రం సింగం 3.
ఆ సినిమాలో సూర్య హీరో . తమిళ స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన హరి ఎన్టీఆర్ నటించిన టెంపర్ చూశానని చాలా బాగా నచ్చిందని తప్పకుండా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ కొసం ఎదురు చూస్తున్నాని అంటున్నాడు.
మరి పోలీస్ రోల్ లో సూర్యను హ్యాట్రిక్ హిట్ సాధించేలా చేసిన హరి నిజంగా కథతో వస్తే జూ.ఎన్టీఆర్ ఏమంటాడో. ఏదేమైనా తెలిివిగా ఎన్టీఆర్ తో సినిమా చేయాలనే ఆలోచనతోనే... హరి ఇలా బిహేవ్ చేశాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.