
కమల హాసన్ కూతురు, నటి శ్రుతి హాసన్ ఎవరితోనైనా డేటింగ్‌లో ఉందా? అతడితో కలిసి వేలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుందా? అంటే అవుననే అంటున్నాయి. దానికి కారణం.. వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రుతిహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న మైకేల్ కోర్సాలేతో ముంబై ఎయిర్‌పోర్ట్ బయట కనిపించింది. మూడు నెలల నుంచి అతడితో ప్రేమలో ఉందట. అంతేకాదు.. అతడిని తన తండ్రి కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసిందని టాక్. ఇంతకీ ఎవరీ కోర్సాలే అంటే.. ఇటలీ జాతీయుడు. లండన్‌లో నటుడు.
ప్రస్తుతం ‘బెహెన్ హోగీ తేరీ’ అనే సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. దీంతో ఆమెతో టైం స్పెండ్ చేసేందుకు అతడు ముంబైకి వచ్చాడని టాక్. అంతేకాదు.. ఇటీవల శ్రుతి తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పెట్టిన పోస్టు కూడా ఆమె ప్రేమలో పడిందనేదానికి బలం చేకూరుస్తోందని అంటున్నారు. ‘ప్రతి అడుగు విలువైనదే. అది కలిసి వేసినా.. ఒంటరిగా పడినా. మీ గమ్యం చేరేదాకా నడవాల్సిందే’ అని ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.