Siddhas saga:ధర్మస్థలి జోలికొస్తే 'సిద్ధ'డికి అమ్మవారు పూనుతుంది... కొరటాల నుండి మరో బ్లాక్ బస్టర్!

By team teluguFirst Published Nov 28, 2021, 4:47 PM IST
Highlights

నిమిషానికి పైగా నిడివి ఉన్న టీజర్ లో రామ్ చరణ్ (Ram charan)పాత్రపై చాలా వరకు స్పష్టత వచ్చింది. ధర్మస్థలికి కాపలా దారుడిగా, యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడిగా చరణ్ కనిపిస్తున్నాడు.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala siva)నుండి మూవీ వస్తుందంటే మామూలు విషయమా! అది కూడా రామ్ చరణ్-చిరంజీవి ల మల్టీస్టారర్ గా. ఈ ప్రాజెక్ట్ ని కొరటాల శివ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఒక్క టీజర్ తోనే మనకు అర్థమయ్యేలా చేశాడు. ఆచార్య మూవీ నుండి రామ్ చరణ్ టీజర్ నేడు విడుదల చేశారు. సినిమా విడుదలకు రెండు నెలల సమయం ముందే వచ్చిన టీజర్... ఆచార్య మూవీపై ప్రేక్షకుల ఆలోచనలు పూర్తిగా మార్చివేసింది. చిరంజీవి, రామ్ చరణ్ కెరీర్ లో ఓ స్పెషల్ మూవీగా ఆచార్య నిలవనుందన్న హింట్ ఇచ్చింది. 

నిమిషానికి పైగా నిడివి ఉన్న టీజర్ లో రామ్ చరణ్ (Ram charan)పాత్రపై చాలా వరకు స్పష్టత వచ్చింది. ధర్మస్థలికి కాపలా దారుడిగా, యుద్ధ విద్యలలో ఆరితేరిన వాడిగా చరణ్ కనిపిస్తున్నాడు. శాంతికి మారుపేరు అయిన సిద్ధ... యుద్ధం వైపు ఎందుకు మళ్లాడు? ధర్మస్థలికి వచ్చిన ఆపద ఏమిటీ? ఆచార్య, సిద్ధ ఎవరిపై యుద్ధం చేశారనేది? ఆచార్య మూవీ ప్రధాన కథగా తోస్తుంది. 

టీజర్లో అడవి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. విలన్ రోల్ చేస్తున్న సోనూ సూద్ చరణ్ తో తలపడుతున్న సీన్ మనం చూడవచ్చు. ఇక చరణ్ కి జోడీగా నటిస్తున్న పూజా హెగ్డే ఇన్నోసెంట్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా ఉంది. మణిశర్మ బీజీఎమ్ అదుర్స్. ఇక టీజర్ చివర్లో... నీటి కాలువకు అటువైపున చిరుత పిల్లతో చిరుత... ఇటు వైపు చరణ్ తో చిరంజీవి (Chiranjeevi)ఉన్న విజువల్ అబ్బురపరుస్తుంది. 

Also read Allu Arjun: `మెగా` కాదు, `అల్లు`నే ఫస్ట్.. ఎన్టీఆర్‌తో పోల్చడం వెనకాల బన్నీ ఉద్దేశ్యం అదేనా?

మొత్తంగా ఆచార్య టీజర్ అంచనాలకు మించి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ చిరంజీవికి జంటగా నటిస్తుండగా, ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

Also read NTR: ఎన్టీఆర్ పై ఆయనలా స్పందించడం అనూహ్యమే... ఇదేం ట్విస్ట్ సామీ!

click me!