ఏపీ ప్రభుత్వంపై దిమ్మతిరిగే సెటైర్ వేసిన హీరో నవదీప్.. మామూలుగా పేలలేదుగా..

By telugu teamFirst Published Nov 28, 2021, 4:12 PM IST
Highlights

గౌతమ్ ఎస్ ఎస్ సి, చందమామ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో హీరో నవదీప్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కొన్ని చిత్రాల్లో నవదీప్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నవదీప్ తరచుగా అభిమానులతో ఆసక్తికర అంశాలు షేర్ చేసుకుంటుంటాడు.

గౌతమ్ ఎస్ ఎస్ సి, చందమామ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో హీరో నవదీప్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కొన్ని చిత్రాల్లో నవదీప్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నవదీప్ తరచుగా అభిమానులతో ఆసక్తికర అంశాలు షేర్ చేసుకుంటుంటాడు. నవదీప్ కు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. 

 Navdeep ఎక్కడ కనిపించినా అందరితో జోవియల్ గా ఉంటాడు. తాజాగా నవదీప్ సరదాగా ఓ సెటైర్ వేసినప్పటికీ దానిపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఏపీ టికెట్ ధరల సమస్య ప్రస్తుతం Tollywood ని కలవరపెడుతున్న అంశం. చిన్న చిత్రం అయినా , పెద్ద చిత్రం అయినా ఒకే టికెట్ ధర అంటూ ఏపీ ప్రభుత్వం తక్కువ రేట్లకే సినిమా టికెట్ ధరలు నిర్ణయించింది. అలాగే ఆన్లైన్ టికెట్ విధానాన్ని కూడా తీసుకువస్తోంది. పెద్ద చిత్రాలకు,  అదనపు షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీనితో టాలీవుడ్ నిర్మాతలకు ఇది పెద్ద సమస్యగా మారింది. దీనిపై నవదీప్ సోషల్ మీడియాలో సెటైరికల్ గా స్పందించాడు. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నవదీప్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 'సినిమా టికెట్ వర్సస్ టమాటో' అంటూ నవదీప్ కామెంట్ పెట్టాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో సినిమా టికెట్ ధరలపై నవదీప్ ఎలాంటి సెటైర్ వేశాడో అని. 

ప్రస్తుతం టమాటో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టమాటో కొనాలంటే సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఏపీలో సినిమాలకు సింగిల్ టికెట్ ధర.. కిలో టమాటో ధరకంటే తక్కువగా ఉంది అంటూ నవదీప్ పరోక్షంగా తెలియజేశాడు. కాసేపటికే నవదీప్ ఈ ట్వీట్ ని డిలీట్ చేసినట్లు ఉన్నాడు. సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ విధానాలని టాలీవుడ్ లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ఏపీ ప్రభుత్వానికి రిక్వస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు సైలెంట్ గా ఉండడం ఆసక్తిగా మారింది. 

చిరంజీవి ఆన్లైన్ టికెట్ విధానాన్ని ప్రశంసిస్తూనే.. టికెట్ ధరలపై మాత్రం ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి అని సీఎం జగన్ కు ట్విట్టర్ వేదికగా విన్నవించారు. టాలీవుడ్ సమస్యలపై, టికెట్ విధానాలపై జగన్ కు విన్నవించేందుకు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా నవదీప్ ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలకోసం ఎదురుచూస్తున్నాడు. ధృవ, ఆర్య 2 లాంటి చిత్రాల్లో నవదీప్ పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవదీప్ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తూ కొత్త మేకోవర్ కోసం ట్రై చేస్తున్నాడు. 

Also Read: Malavika: కుర్రాళ్లపై మాళవిక అందాల దాడి.. ఇంతటి విస్పోటనం ఎప్పుడూ చూడలేదట.. యాక్షన్‌ చేస్తే గాయమైందంటూ ఆవేదన

click me!